Tourist Attractions

Rathotsavam held with fervour, gaiety

KADAPA: Thousands of devotees participated in the Rathotsavam in Sri Venkateswara Swamy temple at Devunikadapa on Thursday, as part of the Rathasaptami festival.

Devotees participated with religious fervour and gaiety and pulled the large chariot decorated with flowers carrying the utsav idols of Lord Venkateswara Swamy and his consorts Bhoodevi and Sridevi while chanting the Govindanama.

The Rathotsavam was held as part of the ongoing Brahmotsavams.

Men and women offered flowers and received prasadams. Temple priests, former temple committee chairman A. Krishna Kumar and others participated in the festivities held.

Read :  జగన్ ను వెన్నంటి ఉండే ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి 30?

Telugu Summary:

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం దేవుని కడప భక్తులతో  పోటెత్తింది. భక్తుల గోవింద నామ స్మరణల మధ్య శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వా మి రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో భక్తు లు స్వామి వారికి బ్రహ్మరథం పట్టారు .కిక్కిరిసిన భక్తజనం.. మధ్య కడప రాయుని రథం గంభీరంగా కదిలింది. అందంగా అలంకరించిన తేరులో శ్రీదేవి, భూదేవిలతో కొలువైన శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందు కు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Devuni Kadapa Rathotsavamఎత్తయిన తేరులోని స్వామిని చూసేందుకు భక్తులు మేడలపైకి ఎక్కారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆకుల కృష్ణకుమార్ రథం పైనుంచి భక్తులచే గోవింద నామస్మరణ చేయించారు. రథం ముందు వైపునుంచి భక్తులు ఇనుప గొలుసులతో లాగుతుండగా, పాత కడప, దేవుని కడప యువకులు పోటీలు పడి ఉత్సాహంగా రథాన్ని ముందుకు కదిలించారు. పలువురు భక్తులు రథ చక్రాల కింద గుమ్మడికాయలు ఉంచి మొక్కులు తీర్చుకున్నారు.

Read :  కడపలో అఖిల భారత స్థాయి చెస్‌ పోటీలు

అంతకుముందు ఉదయం ఆరు గంటలకు ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లను రథంపై కొలువుదీర్చారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయంలో స్వామి మూల విరాట్‌ను దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కడప ఎస్పీ తరుణ్‌జోషి దంపతులు, నగర పాల క సంస్థ కమిషనర్ జాన్ శ్యాంసన్ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దంపతులకు అర్చకులు ఆలయ చరిత్ర, విశిష్టతలను వివరించారు.

బ్రహ్మోత్సవాల్లో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం ముందు ‘రోప్’ పార్టీని ఏర్పాటు చేశారు. సాయంత్రం 5.30 గంటలకు రథం యథాస్థానానికి చేరింది. ఈ సందర్భంగా దేవుని కడప అంతటా వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎక్కువగా చెరకు గడలను కొనుగోలు చేశారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా నగర పాలక సంస్థ ఉద్యోగుల అన్నదాన కమిటీ ఉదయం 11 గంట ల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆలయ సమీపంలోని ప్రైవేటు కల్యాణ మండపంలో అన్నదానం చేశారు.

Read :  PROFILE OF KADAPA DISTRICT

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మంచినీళ్లు, మజ్జిగ, పానకాలను భక్తులకు ఉచితంగా అందజేశారు.రెండవ మార్కెట్ వద్దనుంచి ఆలయం వరకు పలువురు భక్తులు అన్నం పొట్లాలు, పానకం, మజ్జిగ, మంచినీరు, నీటి ప్యాకెట్లను ఉచితంగా అందజేశారు.

Check Also

Two rocks of Buddha’s footprints found at Pullur

Two sets of Lord Goutama Buddha’s footprints found  in two different places nearby Pullur (Anjaneyakottalu) …

Sri Tallapaka Annamacharya – The mystic saint composer

Sri Tallapaka Annamacharya (1408-1503) the mystic saint composer of the 15th century is the earliest …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *