Tourist Attractions

మైదుకూరు,పోరుమామిళ్ళ,బద్వేలు ప్రజలకు తీరనున్న రైలు కల!

తాజాగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కడప జిల్లాలోని  మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ళ, కలసపాడు ప్రాంతాల ప్రజలకు ఇప్పటిదాకా ఒక కలగా మిగిలిన రైలుసౌకర్యం సమీప భవిష్యత్తులో నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న ప్రొద్దుటూరు-కంభం, లైను సర్వేకు ఆమోదం తెలపడంతో పాటు తాజాగా గిద్దలూరు-భాకరాపేట(భాకరాపేట స్టేషన్ కడప-రేణిగుంట లైనుపై కడప-ఒంటిమిట్ట స్టేషన్ల మధ్య వస్తుంది.) లైను ప్రతిపాదనకు సైతం కేంద్ర రైల్వే  శాఖ ఆమోదం తెలిపింది.

యర్రగుంట్ల-నంద్యాల రైల్వే లైను నిర్మాణం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మీదుగా నొస్సం గ్రామం వరకు పూర్తైన విషయం అందరికీ తెలిసిందే! దీంతో ప్రొద్దుటూరు నుండి చాపాడు, మైదుకూరు, బ్రహ్మంగారి మఠం , పోరుమామిళ్ళ, ప్రకాశం జిల్లా కొమ్మరోలు, బేస్తవారిపేట ల గుండా కంభం వరకు నూతన రైల్వే లైనును నిర్మిస్తారు. అలాగే గిద్దలూరు-భాకరాపేట ల మధ్య కొత్త లైను నిర్మాణానికి కూడా ఈ బడ్జెట్లో ఆమోదం లభించడంతో ఈ లైను కూడా పోరుమామిళ్ళ మీదుగా వెళ్ళే అవకాశం ఉంది. దీంతో పోరుమామిళ్ళ రైల్వే జంక్షన్ గా రూపొందే అవకాశం ఉంది.  అయితే నిధుల కేటాయింపు అరకొరగా ఉండడంతో ఈ కల సాకారం కావడానికి చాల రోజులు పడుతుందని మాత్రం చెప్పవచ్చు.

Read :  If you are so confident, call for an election: Jagan

ఏళ్ల తరబడి నిరాదరణకు గురవుతున్న కడప జిల్లాపై ఎంపీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కృషి వల్ల కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ కరుణ చూపారు. కడప-బెంగళూరు రైల్వే మార్గానికి మహర్దశ పట్టనుంది. గత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కడప-బెంగళూరు రైలు మార్గం ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు ఇస్తుందని సుముఖత వ్యక్తం చేశారు. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 2009లో అంగీకారం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 29 కోట్లు నిధులు కేటాయించగా, కేంద్ర ప్రభుత్వం రూ. 29 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం రూ. 58 కోట్లు ఆ మార్గానికి నిధులు రిజర్వులో ఉన్నాయి. 2010-11 రైల్వే బడ్జెట్‌లో మరో రూ. 80 కోట్లు నిధులు కేటాయిస్తూ అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయాలని సూచించారు.

Kadapa Railway Station

అధికారులు మొత్తం నిధులను ఏడాదిలోపు ఖర్చు చేయగలిగితే తిరిగి నిధులు కేటాయించేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేయడంతో కడప-బెంగళూరు మార్గానికి సముచిత ప్రాధాన్యత చూపారని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. మార్చి లో ఈ మార్గానికి అధికారికంగా శంకుస్థాపన చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. నందలూరులో ఏర్పాటు చేస్తారనుకున్న వ్యాగిన్‌ రిపేరు వర్క్‌షాపు సికింద్రాబాద్‌కు తరలిపోవడమే నిరాశ కలిగించే అంశం. రూ. వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కడప-బెంగళూరు రైలు మార్గానికి ఇంకా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఉంటే పనులు వేగంగా జరిగేవి. ఇనుపరాయి తరలించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైలు మార్గానికి రూ.69 కోట్లు కేటాయించారు.

Read :  Bypolls battle Started

జిల్లాలో దశాబ్దాలుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గానికి రూ. 80 కోట్లు కేటాయించారు. ఈ లైను పనులు పూర్తి కావాలంటే రూ. 240 కోట్లు అవసరమవుతాయి. నంద్యాల-ఎర్రగుంట్ల డబ్లింగ్‌ పనులు ఈ ఏడాదికి బనగానపల్లె వరకు పూర్తి చేసేందుకు నిర్ణయించారు.

. జిల్లాకు అదనంగా ఒక రైలు రానుంది. హైదాబాదు -చితూర్తు మధ్య కొత్త రైలును ప్రవేశపెడుతున్నారు. ఈ రైలు కడప మీదుగా నడుస్తుంది. ఇప్పటిదాకా ఒకటిగా నడుస్తున్న కోల్హాపూరు, రాయలసీమ రైళ్లను విడివిడిగా నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలును ఒకటిగా నడపడం వల్ల ఎదురవుతున్న సమస్యలపై ఇటీవలే ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. కడప రైల్వే స్టేషన్‌లోని ఆస్పత్రిలో ఇకపై ఓపీ విభాగం, ల్యాబ్‌ను ప్రారంభిస్తారు.

జిల్లా నుంచి కృష్ణపట్నం ఓడరేవుకు నిర్మించనున్న రైల్వేమార్గాన్ని తొలుత భాకరాపేట నుంచి బద్వేలు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, సంగం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు మీదుగా నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇతర కారణాల వల్ల ఈ మార్గాన్ని ఓబులవారిపల్లె నుంచి చిట్వేలు, నెల్లూరు జిల్లా రాపూరు మీదుగా ప్రతిపాదించి మంజూరు చేశారు.

Read :  Kadapa to Rayachoti Bus Timings & Schedule

దీంతో బద్వేలు మీదుగా రైల్వే మార్గం నిర్మించే అవకాశం చే జారింది. తాజాగా ఇప్పుడు భాకరాపేట నుంచి గిద్దలూరు వరకు రైలు మార్గం సర్వేకు ప్రతిపాదించడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మార్గం నిర్మి స్తే హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, ఢీల్లీ తదితర ప్రాంతాలకు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. ఎంపీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కృషి వల్లే ఇది సాధ్యమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూతన రైల్వే మార్గాల వల్ల ప్రొద్దుటూరు,మైదుకురు,పోరుమామిళ్ళ, బద్వేలు, కలసపాడు  ప్రాంతాలు పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

Check Also

Mantralayam to Mydukur Bus Timings & Schedule

Mantralayam to Mydukur Bus Timings & Schedule

Find APSRTC bus timings from Mantralayam to Mydukur. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Mantralayam and Mydukur.

Mydukur to Mantralayam Bus Timings & Schedule

Mydukur to Mantralayam Bus Timings & Schedule

Find APSRTC bus timings from Mydukur to Mantralayam. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Mydukur and Mantralayam.

4 comments

  1. Shaik Khadarvalli

    This is a really good news, I am from Porumamilla and right now am in USA. I am very happy because Porumamilla become a Railway Junction in future.

  2. We are very thank full to Mr.Jaganmohan Reddy garu , it is really very good .These places shows their performance in various catogiries especially Badvel Constuency People…………………………………Thanking you

  3. it is very good news. my name jayachandra from kavalakuntla near 11km away from porumamilla, iam very happy to this good news because porumamilla town as become a railway junction in future .iam very thanks to mr jagan mohan reddy anna coming CM of andrapradesh.

    • itis very good news iam papaiah teacher present working in rajampet. my native is kavalakuntla near 13km away from porumandal town iam very happy to this good news .porumamilla town as become a railway junction in future so thanks to our cheaf minister. and soniya gandhi………….. thking you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *