Tourist Attractions

నేటి నుంచి జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

యువనేత, కడప పార్లమెంట్‌ మాజీ సభ్యులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ నెల 2వతేదీ నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని బద్వేల్‌ నియోజవర్గంలోని గోపవరం మండలంలో జగన్‌ పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాలను ప్రారంభించనున్నారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో వైఎస్‌ అభిమానులు, మాజీ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

గతంలో సమయభావం వలన బద్వేల్‌, అట్లూరు మండలాలలో పర్యటించిన జగన్‌ గోపవరం మండలాలలో విగ్రహాలు ఆవిష్కరించలేకపోయారు. బుధవారం ఉదయం గోపవరం మండల ప్రాజెక్టు కాలనీ నుంచి బ్రాహ్మణ పల్లె వరకు ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాలు ఆవిష్కరించనున్నారు.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బద్వేల్‌ ఎమ్మెల్యే కమలమ్మతో పాటు మాజీ ఎమ్మెల్యే డిసి గోవిందరెడ్డి కూడా పాల్గొననున్నారు.

Read :  Administrative Setup - Kadapa District

3వతేదీన జగన్‌ ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. గురువారం ఉదయం అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి జామియ ఫంక్షన్‌ హాలు నంగనూరు పల్లె, కల్లూరు, ఈశ్వర్‌రెడ్డి నగర్‌, చౌడూరు, తోటపల్లె, అమృతనగర్‌, వివేకానందనగర్‌, గోకుల్‌ నగర్‌, ఎస్‌బిజి చర్చి తదితర ప్రాంతాలలో యువనేత పర్యటించనున్నారు.

4వతేదీన పులివెందులలో జగన్‌ పిఏ హరినాథరెడ్డి వివాహానికి హాజరవుతారు. అనంతరం ఇటీవల హత్యకు గురైన చక్రాయపేట మండలం గండికొవ్వూరు ఇన్‌ఛార్జి సర్పంచ్‌ మోపూరి సుబ్బిరెడ్డి కుటుంబీకులను పరామర్శిస్తారు.

అక్కడి నుంచి ఈమధ్యనే మృతి చెందిన చిలేకాంపల్లె మాజీ విఎం ధర్మారెడ్డి కుటుంబీకులను పరామర్శిస్తారు. ధర్మారెడ్డి కుమారుడు రుగ్మానందరెడ్డి చక్రాయపేట మండలాధ్యక్షునిగా పనిచేస్తున్నాడు.అదే గ్రామంలోని బెల్లం కృష్ణారెడ్డి ఇంటికి కూడా జగన్‌ వెళతారు.

తదుపరి మారెళ్లమడక గ్రామానికి వెళ్లి గండికొవ్వురు సుబ్బిరెడ్డి హత్యఘటనలో గాయపడిన రామాంజుల రెడ్డిని పరామర్శిస్తారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం రింగురోడ్డులో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

Read :  CEO inspects EVMs in Kadapa

తరువాత నల్లపురెడ్డిపల్లెలో వైఎస్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జగన్‌ పాల్గొంటారు. ఇదిలా వుండగా మంగళవారం నాడు పులివెందులలో జగన్‌ మోహన్‌ రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యక్రమాలపై సమాలోచనలు జరిపారు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Check Also

Kadapa Goa

Kadapa to Goa Train Timings

Kadapa to Goa train timings and details of trains. Distance between Kadapa and Goa. Timetable …

Kadapa Goa

Kadapa to Tirupati Train Timings

Kadapa to Tirupati train timings and details of trains. Distance between Kadapa and Tirupati. Timetable …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *