Tourist Attractions

శతావధాని సీవీ సుబ్బన్నకు లోక్‌నాయక్‌ పురస్కారం

విశాఖలోని లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అందించే విశిష్ట పురస్కారానికి ఈ దఫా ప్రముఖ సాహితీవేత్త, శతావధాని సి.వి.సుబ్బన్న ఎంపికయ్యారు. సి.వి.సుబ్బన్న  స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతం.తెలుగు సాహిత్య వికాసంలో విశేష కృషిచేసినవారికి ఏటా ఈ విశిష్ట పురష్కారం అందచేస్తారు. 

 విశాఖనగరం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతులమీదుగా పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ఫౌండేషన్‌ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

పురస్కారం కింద సుబ్బన్నకు రూ.1.25 లక్షల నగదు అందిస్తారు. అవధాన ప్రక్రియను తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదరుల తర్వాత విశేషంగా వ్యాప్తిచేసిన సాహితీవేత్తగా సుబ్బన్నకు పేరుంది.

దాదాపు ఆరు దశాబ్దాలుగా అవధానిగా పేరొందిన సుబ్బన్న అందులో అనేకమందిని తీర్చిదిద్దారు.

Read :  Does Kadapa's heart beat for YS Jagan?

Check Also

Kadapa Goa

Kadapa to Goa Train Timings

Kadapa to Goa train timings and details of trains. Distance between Kadapa and Goa. Timetable …

Kadapa Goa

Kadapa to Tirupati Train Timings

Kadapa to Tirupati train timings and details of trains. Distance between Kadapa and Tirupati. Timetable …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *