కడప : కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కాను న్నాయి. ఆస్థాన- ఎ- మగ్దుముల్లాహి హజ్రత్ ఖ్వాజా సయ్యద్‌షా అమీన్‌పీర్ దర్గాలోని సయ్యద్‌షా ఆరిఫుల్లా మ హ్మద్ మహ్మదుల్ హుసేని చిఫ్తివుల్ ఖాద్రి ఉరుసు ఉత్సవాల గురించి ప్రధాన ముజా వర్ అమీరుద్దీన్, ప్రతినిధి నయీం వి వరించారు. .ఈ ఉత్సవాలు ఆస్తాన్- ఎ- మగ్దుమ్ ఇలాహి సబ్జాదా నషీన్ ( ప్రస్తుత పీఠాధిపతి) సయ్యద్ షా ఆరిఫుల్లా మహ్మద్ మహ్మదుల్ హుసే ని ఆధ్వర్యంలో జరగనున్నాయని వా రు తెలిపారు.
మంగళవాం ఉదయం 8 గంటల కు ఫక్కీర్లు ఊరేగింపుగా దర్గా షరీఫ్‌కు వచ్చి ప్రధాన గురువులకు చదివింపు లు చేసి దర్గాలో బస చేయనున్నారు. రాత్రి 9 గంటలకు మలంగ్‌షాను పీరీ స్థానంలో ఆసీనులను చేయనున్నారు.
బుధవారం నాలుగు రాష్ట్రాల నుం చి భక్తులు, పండితులు దర్గాకు చేరు కుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు అమీన్ ఐటిఐ వార్షిక నివేదిక సమర్ప ణ, రాత్రి 10 గంటలకు ప్రస్తుత పీఠా ధిపతి తమ నివాసం నుంచి గంధం కలశాన్ని ఊరేగింపుగా వచ్చి దర్గాలో చదివింపులు చేయనున్నారు.
గురువారం సాయంత్రం 6.30కు ఐదార-ఎ- అమీనియా సంస్థ నివేదిక సమర్పణ జరుగుతుంది. రాత్రి 9 గం టల నుంచి ఉరుసు ఉత్సవం నిర్వహి స్తారు. ఫకీర్లు, పైల్వానులు విన్యాసా ల మధ్య గంధం సమర్పించి చదివింపు లు నిర్వహిస్తారు. అనంతరం ఖసాయత్ కార్యక్రమం, ఆ తరువాత ఆసారే షరీఫ్ జియారత్ కార్యక్రమాలుంటా యి.
శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి కిఫ్తిలూటి (మహానైవేద్యం) చ దివింపులు ఇస్తారు. రాత్రి 9 గంటలకు మలంగ్‌షాను దీక్ష విరమింపజేస్తారు. దర్గా వద్ద ప్రదక్షిణ చేయిస్తారు. అనం తరం పీఠాధిపతి సమక్షంలో జాతీయ స్థాయి కవి సమ్మేళనం నిర్వహిస్తారు.
శనివారం పీఠాధిపతి ఫకీర్ల సమ స్యలను విచారిస్తారు. వారికి బహుమ తులు, చౌదరీలు, ఖలీఫాలకు వస్త్రాల ను బహూకరించనున్నారు.
ఆదివారం పీఠాధిపతి ఆధ్వర్యం లో పండితులు, ఫకీర్లు, భక్తులు, వాట ర్ గండి వద్ద గల కొండల్లోని గుహ వద్ద జెండాను ప్రతిష్ఠిస్తారు. భోజనా నంతరం సభ నిర్వహిస్తారు. సాయం త్రం నగరంలోని మాసాపేటలో గల మై అల్లా దర్గా వద్ద నుంచి దర్గా వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు.
సోమవారం ఫకీర్ల సంఘాలకు జర్రా ప్రసాదించి వారు వారి ఊళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తారు.
Tags ameen peer dargah kadapa urs
Check Also
Kadapa to Vishakaptanm (Vizag) Train Timings
Kadapa to Vishakapatnam (Vizag) train timings and details of trains. Distance between Kadapa and Vishakapatnam. …
Kadapa to Chennai Train Timings
Kadapa to Chennai train timings and details of trains. Distance between Kadapa and Chennai. Timetable …