Tourist Attractions
రాజ్యాంగదత్తమైన పర్యటన హక్కుపైన తెలంగాణ వాదం పేరుతో ఉక్కుపాదం మోపారు. ప్రజాస్వామ్య హననానికి సాహసించారు. వ్యక్తి స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అధికారగణం, ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. నిన్నమొన్నటివరకు నక్సలైట్ల నిషేధానికి బెదిరి నియోజకవర్గాలలో తిరగడానికి భయపడిన వారే ఇప్పుడు నక్సలైట్లను తలదన్నేలా నిషేధాలకు దిగుతున్నారు.నిన్నటి వరకు జగన్ ను మాత్రమే అడ్డుకుంటామని చెప్పుకున్న ముసుగు ఉద్యమకారులు నేడు ఒకడుగు ముందుకేసి సమైక్యవాదులందరినీ తెలంగాణలో అడుగు పెట్టనివ్వమంటున్నారు.

జగనే వీరికి పేద్ద విషయం!

దేశంలో ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లివచ్చే స్వేచ్ఛ- రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కు.

రాజ్యాంగదత్తమైన ఈ పర్యటన హక్కుపైన తెలంగాణ వాదం పేరుతో ఉక్కుపాదం మోపారు. ప్రజాస్వామ్య హననానికి సాహసించారు. వ్యక్తి స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అధికారగణం, ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి.

నిన్నమొన్నటివరకు నక్సలైట్ల నిషేధానికి బెదిరి నియోజకవర్గాలలో తిరగడానికి భయపడిన వారే ఇప్పుడు నక్సలైట్లను తలదన్నేలా నిషేధాలకు దిగుతున్నారు. నిన్నటి వరకు జగన్ ను మాత్రమే అడ్డుకుంటామని చెప్పుకున్న ముసుగు ఉద్యమకారులు నేడు ఒకడుగు ముందుకేసి సమైక్యవాదులందరినీ తెలంగాణలో అడుగు పెట్టనివ్వమంటున్నారు. ఒకవేళ తమ మాట వినకుండా అడుగు పెడితే మహబూబాబాద్ లాంటి మరిన్ని ఘటనలు జరుగుతాయంటూ హెచ్చరింపులకు దిగుతున్నారు.

సమైక్య రాష్ట్రంలోనే ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి వెళ్లి తమ అభిప్రాయాలను  వెల్లడి చేసే పరిస్థితి లేకుండా కొంత మంది వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా పరిణమిస్తుంటే ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం మనకు పట్టిన దౌర్భాగ్యం.

అల్లర్లకు ప్రేరేపించిన వారిని, ఉద్యమం ముసుగులో నిషేదాజ్ఞలు జారీ చేసిన వారినీ, రాజ్యాంగ ప్రసాదితమైన హక్కులను హరిస్తున్న వారినీ వదిలేసి వ్యక్తిగత యాత్రకని బయలుదేరిన పార్లమెంట్ సభ్యుడు జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన ప్రభుత్వ వైఖరి పలు అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది.  ‘ఇదే పరిస్థితి రేపు చంద్రబాబు లేదా రోశయ్యకు ఎదురైతే ప్రభుత్వం ఇలానే చేష్ఠలుడిగి వ్యవహరిస్తుందా?’ అన్న ప్రశ్న పాలకులకు కనువిప్పు కలిగించాలి.

Read :  Siddaiahgari Mutt - Mudumala (Kadapa District)

ఓరుగల్లు ఓదార్పు యాత్రను ఎంతో ముందుగానే ప్రకటించినా ఇటువంటి విపరీత ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎందుకు నివారించలేదన్నది శేషప్రశ్న.

కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి రెండోవిడత ఓదార్పు యాత్ర తలపెట్టినప్పుడే క్షుద్ర రాజకీయ గణాలలో కలకలం రేగింది. ‘గతంలో లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు’ అన్న ప్రశ్నకు ‘ఖమ్మంలో జగన్‌ పర్యటించినప్పుడు పరిస్థితులు వేరు’ అన్న ముఖ్యమంత్రి సమాధానమే అరాచక శక్తులకు అవసరమైన బలాన్నిచ్చింది. ‘జగన్‌ పర్యటన చేస్తే తప్పేంటి? ఓరుగల్లేమన్నా పాకిస్థానా లేక ఆఫ్ఘనిస్తానా?’ అన్న లగడపాటి ప్రశ్నకు పాలకులు సమాధానం చెప్పాలి. జగన్‌ పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా అంచెలవారీ వ్యూహాన్ని సిద్ధం చేసిన తెరాస, వివిధ సంయుక్త కార్యాచరణ సంఘాల నేతలు, తెలంగాణవాదులు, ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు-ప్రభుత్వ, పార్టీ పెద్దల అండదండలున్నాయన్నది సీమాంధ్రలలో సామాన్య ప్రజానీకం అభిప్రాయం.  ఇదే సీమాంధ్రలలో జగన్ అరెస్ట్ కు నిరసనగా అక్కడక్కడా‌ హింసకు దారి తీసింది.

Read :  కరువుబండ యాత్రలు సీమలో ఆగాలంటే...

తాను మంచి కార్యక్రమం చెయ్యబోతుంటే క్షుద్ర రాజకీయం గజ్జె కట్టిందన్న జగన్‌ వ్యాఖ్య సముచితమైనది. స్వార్థ రాజకీయ ఫలాపేక్షతో సెంటిమెంటు మంటల్ని ఎగదోసి తెలంగాణ వాదం పేరిట నిప్పు రాజేసింది కే.సి.ఆరే కదా! తన ఆజ్ఞలను శిరసావహించని వారిని, తెలం’గానం’ ఆలపించని వారి నాలుకలను చీల్చగల వారు, ప్రశాంతతను భగ్నం చేస్తూ మరుభూములుగా మార్చ గల వారు  ఏమి చేసినా అవి  ప్రభుత్వ పెద్దలకు, మీడియాలోని కొన్ని వర్గాలకు పెద్ద విషయాలుగా కనిపించకపోవటం విశేషం. జగన్ యాత్ర చేయటమే వీరికి పేద్ద విషయం. యాత్ర పేరు చెప్పి జగన్-ను రాజకీయంగా నిలువరించాలన్నదే వీరి అసలు లక్ష్యం.!

తెలంగాణవాదాన్ని లేదా సమైక్యవాదాన్ని లేదా మరో ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని శాంతిభద్రతల్ని భగ్నంచేసేలా, సామాజికంగా ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేలా ఎవరు వ్యవహరించినా క్షంతవ్యం కాదు. తనతండ్రి వై.ఎస్‌. మృతివార్త విని అసువులు బాసిన 77మంది అభాగ్యుల కుటుంబాలను పరామర్శిస్తానంటూ వరంగల్‌ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో జగన్‌ ఓదార్పుయాత్ర తలపెట్టారు. ఓదార్పుయాత్ర తనకు వ్యక్తిగతమైనదే తప్ప అది రాజకీయాలకు కానీ, ఉద్యమాలకు కానీ అతీతమైనది కాదని జగన్ కుండ బద్దలుకొట్టారు. వై.ఎస్‌. చనిపోయిన తరువాత గంగ వెర్రులెత్తుతున్న వెంకటస్వామి, కె.కె, సర్వే, మధుయాష్కీ లాంటి కొందరు నాయకులు ఓదార్పుయాత్ర రాజకీయ ఆధిపత్యం కోసమేనని స్పష్టీకరించడం, దానినే ప్రామాణికమన్నట్లు కొద్దిమంది తీర్మానించడాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి భూతద్దంలో చూపెట్టడం ఊహించని వైచిత్రి కాదు.  ఈ పరిణామాల పరమార్థం ప్రజలకు తెలియనిది కాదు.

Read :  మళ్లీ మరొక్కసారి కడప జిల్లాలో జన్మించు..మహానేతా!

అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకొన్నా సరైన విధంగానే తీసుకొంటుందని ఏడు నెలల క్రితం తానే ప్రకటించి, నేడు ఢిల్లీ ఆదేశాల్ని బేఖాతరు చెయ్యడమేమిటి? – అని జగన్ వైఖరిని ప్రశ్నిస్తున్న వారు వ్యక్తిగత పర్యటనకు పార్టీ అనుమతి ఎందుకు తీసుకోవాలో స్పష్టీకరించాలి. తెలంగాణతో ఏ విధంగానూ సంబంధంలేని ఒక మానవీయ యాత్రకు చేతులు అడ్డుపెట్టడంలో ఎవరు ఏ రాజకీయ ప్రయోజనం ఆశించారో, ఎటువంటి అస్తిత్వభయాలు దీనికి ప్రేరేపించాయో జనం గ్రహించగలరు.

Check Also

Kadapa Goa

Kadapa to Tirupati Train Timings

Kadapa to Tirupati train timings and details of trains. Distance between Kadapa and Tirupati. Timetable …

ys jagan

Sonia’s Insult, Reddys’ Revenge, Curse of Andhra: YS Jagan’s Rise is Filmier Than Fiction

YS Jagan ’s Rise Sometime in mid-2010, Vijayalakshmi, popularly known as Vijayamma, the widow of …

4 comments

  1. KCR go and sing duet with Vijaya Shanthi. Hareesh is a big badmash.

  2. Government unable to control the mob. Government watching while KSR and his party workers mobilizing the mob. What is wrong if Jagan visits Telangana. Anyhow, as he told in one of the statements, Telangana issue is not under his control. Central government will look into that matter. How they can co-relate the burning issue with Jagan.

    With my personal experience saying, People of Telangana are not interested for seperate Telangana. Only KSR and his family wants seperate telanga issue in news always, even they too don’t want seperate Telangana. As long as the issue in news the TSR party get more coverage in the local and national media.

  3. KCR, TDP and Congress High Command having Jagan Fever.

  4. orey kcr neku endukura anth thuthara mukku pattukunte pranam pothade kabbati nenu cheppinapani chey ra vedava pachi batanilu konnukoni intlovalini veyinchamnu nevu ne koduku ne kuthuru ne alludu anduru ammukondi ra vadevalara pedda vallu cheppina mata vinadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *