Tourist Attractions
Home » News » విశిష్ట పాత్రికేయుడు శశిశ్రీ కి కేంద్ర మంత్రి ఘన సన్మానం !

విశిష్ట పాత్రికేయుడు శశిశ్రీ కి కేంద్ర మంత్రి ఘన సన్మానం !

కడప  : కడపలోని కృష్ణబాబు స్కౌ ట్స్‌ గైడ్స్‌ హాలులో గురువారం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(జాప్‌) జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్‌ అవార్డు, ఉగాది విశిష్ట పురస్కార గ్రహీత శశిశ్రీ ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఎ. సాయిప్రతాప్‌ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ శశిశ్రీ ప్రము ఖ కవిగా, రచయితగా, సీనియర్‌ జర్నలిస్టుగా తనదైన శైలిలో సమాజానికి సేవచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రతిష్టలు సంపాదించారన్నారు.
సమాజంలో మార్పు తేవడంలో, ప్రజల ను చైతన్య పరచడంలో పత్రికలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుతం పాత్రికేయులకు స్వేచ్ఛలేదని యాజమాన్యం చెప్పిన విధంగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పాత్రికేయులు ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉందన్నారు. అనాదిగా వస్తున్న సంస్కృ తి, సంప్రదాయాలను నేటి తరం మరిచిపోకుండా ఉండేలా రచనలు కొనసాగించాలని ఆకాంక్షించారు. యోగివేమన యూనివర్సిటీ భవనాలు పూర్తి చేసే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 4.7 కోట్ల రూపాయల నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ఇనుము , బంగారు, వజ్రాలు, ఖనిజ సంపద అపారంగా ఉందని వాటిని వెలికి తీసేందుకు ఏపీఎండీసీ, ఎన్‌ఎండీసీ భాగస్వామ్యం లో 50-50 వాటాతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎ. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యునిగా ఉంటూ శశిశ్రీ విశేష సేవలందించారని కొనియాడారు. ముఖ్యంగా తంజావూరులో ఉన్న తెలుగు శాసనాలను విశ్వవిద్యాలయానికి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. జాప్‌ సలహా కమిటీ చైర్మన్‌ ఉప్పల లకణ్‌ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ శశిశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో ఉత్తమ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుగా అవార్డు వచ్చిందన్నారు. నేడు ఉగాది విశిష్ట పురస్కారం, అంతర్జాతీయ యుని సెఫ్‌ అవార్డు దక్కడం ఎంతో సంతోషదాయకమన్నారు. సన్మాన గ్రహీత శశిశ్రీ మాట్లాడుతూ తనకు జరిగి న సన్మానానికి ధన్యవాదాలు తెలిపారు. వార్తాపత్రికలు, మీడియా వాస్తవికతను ప్రతిబిం బించేవిధంగా ఉండాలని సూచించారు. పీసీసీ కార్యద ర్శి టి. శివశంకర్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఆర్‌ఐ సుబ్బారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు ఎం.వి. సుబ్రమణ్యం, జాప్‌ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి తదితరులు శశిశ్రీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి రమణయ్య, చెన్నూరు నాయకుడు చల్లా మధుసూదన్‌రెడ్డి, సీపీఐ నాయకుడు ఓబులేసు, జాప్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Read :  Industrialist Obul Reddy passes away

అటువంటి స్నేహశీలి అంతర్జాతీయ యుని సెఫ్‌ అవార్డుతో పాటు ముఖ్యమంత్రి ద్వారా ఉగాది విశిష్ట పురస్కారం అందుకోవడం జిల్లాకే గర్వకారణమన్నారు .మన చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే రచనలు నేటి సమాజానికి చాలా అవసరమని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఎ. సాయిప్రతాప్‌ పేర్కొన్నారు.

Check Also

anburajan

AnbuRajan Takes charge As Kadapa SP

IPS Officer AnbuRajan took over as the new SP of YSR district (the native district …

Kadapa Goa

Kadapa to Goa Train Timings

Kadapa to Goa train timings and details of trains. Distance between Kadapa and Goa. Timetable …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*