Tourist Attractions

కడప పౌరుషానికి చిరునామా..జగన్ రాజీనామా!

కాంగ్రెస్అధిష్ఠాన వర్గం చేపట్టిన దుష్ట రాజీయాలను చీదరించుంటూ వై.ఎస్.జగన్ చేసిన రాజీనామా కడప పౌరుషానికి చిరునామాగా అభివర్ణించవచ్చు. జనహృదయనేత డాక్టర్ వై.ఎస్.రాజసేఖర రెడ్డి మరణానంతరం  కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వంతో పాటు కొంత మంది పార్టీ సీనియర్ నేతలు, రాజశేఖర రెడ్డి ప్రతిష్ట ను మసకబార్చే విధంగా ప్రవర్తించడం జగన్ ను, డాక్టర్ వై.ఎస్. సతీమణి విజయలక్షుమ్మ ను పలువిధాలుగా అవమానాలకు గురిచేయడంవల్లే జగన్ తో పాటు విజయలక్షుమ్మ కూడా రాజీనామా చేశారు.

తాను చేపట్టిన ఓదార్పు యాత్రను రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేయడమే ఇప్పుడు జగన్ ముందున్న తక్షణ కర్తవ్యం! డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి రెక్కల కష్టం వల్లే రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు విశ్వసిస్తున్నప్పటీ ప్రజల విశ్వాసాలకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలు  జగన్ రాజీనామాకు పురిగొల్పాయని  స్పష్టమౌతోంది.

Read :  PROFILE OF KADAPA DISTRICT

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన కొంపకు  చేజేతులా నిప్పు పెట్టుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. కాగా జగన్ , విజయలక్షుమ్మ ల రాజీనామా  వ్యవహారం రాష్ట్రంలో దివంగత నేత రాజసేఖర రెడ్డి , జగన్ ల అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తొంది.

జగన్ ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీకి జగన్ రాజీనామా చేయడంతో వై.ఎస్.ఆర్ ఆశయాలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబించే విధంగా రాష్ట్రంలో జగన్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమైంది.’ ‘వై’ ‘  అంటే ” యువజన ” ,’ఎస్ ” అంటే “శ్రామిక” , ‘ఆర్” అంటే “రైతు”  అని ఈ పార్టీకి పేరు పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండిన వై.ఎస్.స్థానంలో జగన్ ను  చూసుకోవాలనుకుంటున్న  ప్రజల అకాంక్షలు నెరవేరే దిశగా ఈ పరిణామాలు దారితీస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.

Read :  Irrigation Projects in YSR District

Check Also

Kadapa Slabs vs Rajasthan Marble

Kadapa Slabs vs Rajasthan Marble: A Smarter Choice for Your Floors Choosing the right flooring …

Madanapalli to Mydukur Bus Timings & Schedule

Madanapalli to Mydukur Bus Timings & Schedule

Find APSRTC bus timings from Madanapalli to Mydukur. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Madanapalli and Mydukur.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *