ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణ గురువారం ఉదయం చెన్నయ్ లో కన్ను మూశారు.ఆయన వయసు 78 సంవత్సరాలు. ఆయన గత కొంత కాలంగా అనార్గ్యంతో (హృద్రోగంతో) బాధపడుతున్నారు.
ముళ్లపూడి వెంకట రమణ ‘బుడుగు’ సృష్టికర్తగా తెలుగు పాఠకులందరికీ సుపరిచితులే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన పాత్రికేయునిగా, రచయితగా, నిర్మాతగా బహుముఖ పాత్రలను పోషించారు. ‘నా రాత అతని గీత మా సినిమా తీతకు పునాదులు వేశాయి’ అంటూ బాపుతో కలిసి తన సినీరంగ ప్రవేశం గురించి చెప్పే రమణ ఆరుసార్లు సినీ రచయితగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు.
ఎస్‌ఎస్‌ఎల్‌సి వర కూ చదువుకున్న ఆయన, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసే ‘రఘుపతి వెంక య్య అవార్డు’ను తన మిత్రుడు బాపుతో కలిసి అందుకున్నారు. ముళ్లపూడి రాసిన ‘సీతాకళ్యాణం’ కథకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది కూడా….