కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో ‘దక్షిణ భారత దేశ చరిత్ర కాంగ్రెస్’ సదస్సు శుక్రవారం ప్రారంభిస్తారు. ఇవి మూడు రోజులపాటు కొనసాగుతాయని ఉపకులపతి డాక్టర్ అర్జుల రామచంద్రారెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో చరిత్ర, పురావస్తుశాఖ అధిపతి డాక్టర్ జి.సాంబశివారెడ్డి, సహాయ ఆచార్యులు డాక్టర్ ఉదయరాజువారిజా కృష్ణకాంత్‌తో కలిసి మాట్లాడారు. చరిత్ర కాంగ్రెస్‌కు సంబంధించిన సదస్సు కడపలో మొదటిసారి నిర్వహిస్తున్నామన్నారు. కొత్త విశ్వవిద్యాలయాలు 14 వచ్చినా.. ఇక్కడే ఆ కార్యక్రమం నిర్వహించటం గర్వకారణంగా పేర్కొన్నారు. ఉన్నత విద్య ముఖ్యకార్యదర్శి సి.ఆర్.బిస్వాల్, న్యూఢిల్లీలోని భారతీయ పరిశోధన కేంద్రం, ఇర్షాత్ అలమ్ పురావస్తుశాఖ సంచాలకుడు ఆచార్య పి.చెన్నారెడ్డి, కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ హాజరవుతారని వివిరించారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ చరిత్ర పురావస్తు శాఖకు చెందిన ఆచార్యులు, పరిశోధకులు వస్తున్నారన్నారు. చరిత్రపట్ల విలువైన విషయాలు తెలుసుకొనే అవకాశం లభిస్తోందని తెలిపారు. జిల్లా చరిత్రను వెలికితీసేందుకు బ్రౌన్ గ్రంథాలయంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉపకులపతి వెల్లడించారు. విశ్వవిద్యాలయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు జాతీయ స్థాయి సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.
Tags history congress kadapa soth indian history congress south yogi vemana university
Check Also
Greatness of Kadapa
Kadapa District Specialities and uniqueness from the famous Yogi Vemana University Research Scholars Read : …
Kadapa to Goa Train Timings
Kadapa to Goa train timings and details of trains. Distance between Kadapa and Goa. Timetable …
Good, YVU is showing progress… It has to continue the journey. YVU should take up projects/study that will benifit/help Rayalseema Region.