మైదుకూరు: మండలంలోని జీవి సత్రం లోని తన తల్లిదండ్రులు సుబ్బమ్మ, వెంకటస్వామిరెడ్డిల స్మారక ప్రజావైద్యశాలను ప్రభుత్వ పీహెచ్‌సీగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. మీ విద్యుక్త ధర్మం మీరు నిర్వర్తిస్తే ప్రజలు దేవుళ్లుగా కొలుస్తారని, మానవుని అనారోగ్యంతో ఆడుకోవద్దని వైద్యశాఖసిబ్బందికి హితవు పలికారు.
- ఇక నుంచైనా వెద్యశాఖలో మానవత్వం ఉందని నిరూపిద్దామని సూచించారు. జీవి సత్రం ప్రజావైద్యశాలను ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంకు అప్పగించినట్లు మంత్రి వివరించారు. తను విజ్ఞాపన మేరకు ప్రభుత్వం పిహెచ్‌సీగా అనుమతిని ఇస్తూ జీ వో జారీ చేసిందని, ఈ ఆస్పత్రికి సంబంధించిన పరికరాలు, భవనం, 30 సెంట్ల స్థలం, ఆస్పత్రికి ’5లక్షలు డబ్బు అప్పగించినట్లు తెలిపారు. అలాగే శుక్రవారం పలుగురాళ్లపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కూడా మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రారంభించారు. సాధారణంగా ఆరోగ్యశాఖ అంటే ఇష్టపడనని, మూడు శాఖలను ఏకం చేసి సీఎం తనపై బాధ్యతలను అప్పగించడంతో ఛాలెంజ్‌గా ఈ బాధ్యతలను తీసుకొని పనిచేస్తున్నాని వివరించారు.
1993లో ఎర్రంపల్లెలో కలరా వచ్చిందని, వారు పడ్డ వేదనను చూసి… కచ్చితంగా పలుగురాళ్లపల్లెలో ఆరోగ్యకేంద్రాన్ని నిర్మించేందుకు నిర్ణయానికి వచ్చానన్నారు. మొట్టమొదటిసారిగా జీవీసత్రం, పలుగురాళ్లపల్లెలో ఆసుపత్రుల ఏర్పాటుకు సంతకం చేశానన్నారు. త్వరలో వస్తానని, మీ సమస్యలన్నీ ఒకొక్కటీ పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.