కడప, జనవరి 20: కడప లోని చిన్నచౌకు బైపాస్‌లో వుంటున్న పోట్లగిత్తను మరిపింపచేసే ఓ పొట్టేలు సాహసాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతేకాదు సుమా ఆ యజమాని ఎక్కడికి వెళ్లినా అతని వెంటే వెళ్ళడంతో పాటు తెల్లారిందని గుర్తు చేస్తూ యజమానిని, కుటుంబ సభ్యులను నిద్దుర లేపుతూ తనవంతు సాయం చేస్తోంది. దీంతో ఆ కుటుంబం ఆ పొట్టేలుపై ఎంతో మక్కువ పెంచుకున్నారు. చిన్నచౌకు బైపాస్‌లో నివాసముంటూ హోటల్ నిర్వహిస్తున్న గాజులపల్లె ఓబుల్‌రెడ్డి ఐదు నెలల క్రితం ఏడాది వయసున్న పొట్టేలు పిల్లను రామాపురం సంతలో రూ.3,500కు కొనుగోలు చేశారు. పొట్టేలు అనారోగ్యానికి గురి కావడంతో ఇక అది బతకదనుకున్న ఓబుల్‌రెడ్డి చింతకొమ్మదిన్నె సమీపంలో వున్న గంగమ్మ తల్లికి పొట్టేలు బతికితే బలిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుంచి పొట్టేలు రోగం నయం కావడంతో పాటు బలంగా తయారైంది.పదిమందిని టైర్ బండిపై కుర్చో బెట్టినా ఎద్దుకు దీటుగా బండిని లాక్కుంటూ వెళుతుంది. ఈ విన్యాసం ఆ ప్రాంతీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. |
Tags chinnachowk gajulapalle kadapa pottelu
Check Also
Visakhapatnam to Kadapa Bus Timings & Schedule
Find APSRTC bus timings from Visakhapatnam to Kadapa. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Visakhapatnam and Kadapa.
Kadapa to Markapuram Bus Timings & Schedule
Find APSRTC bus timings from Kadapa to Markapuram. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Kadapa and Markapuram.
www.kadapa.info Voice of the YSR Kadapa District
చిన్నచౌకు బైపాస్‌లో నివాసముంటూ హోటల్ నిర్వహిస్తున్న గాజులపల్లె ఓబుల్‌రెడ్డి ఐదు నెలల క్రితం ఏడాది వయసున్న పొట్టేలు పిల్లను రామాపురం సంతలో రూ.3,500కు కొనుగోలు చేశారు. పొట్టేలు అనారోగ్యానికి గురి కావడంతో ఇక అది బతకదనుకున్న ఓబుల్‌రెడ్డి చింతకొమ్మదిన్నె సమీపంలో వున్న గంగమ్మ తల్లికి పొట్టేలు బతికితే బలిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుంచి పొట్టేలు రోగం నయం కావడంతో పాటు బలంగా తయారైంది.