కడప, 13 డిసెంబర్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజకీయ నేతలు పార్టీలకతీతంగా సమైక్యంగా ఉద్యమించేందుకు ఐక్య కార్యాచరణ కమిటీని రూపొందించారు. ఉద్యమ ఉధృతిని పెంచేందుకు సన్నద్ధమయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రమైన కడపలో కాంగ్రెస్, తెలుగుదేశం, పీఆర్పీ, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. 1948 నుంచే రాయలసీమ నినాదం వచ్చిందని అప్పట్లో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి తెలుగు రాష్ట్రంగా విడిపోవడం కంటే రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయడమే మంచిదని సూచించారని పలువురు పేర్కొన్నారు.
ఆ వాదన అటు తర్వాత బలపడలేదని, కరవును పారదోలేందుకు పెద్దపీట వేస్తూ ఉద్యమాలు నిర్వహించారన్నారు. రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం సమైక్యాంధ్రకు కట్టుబడుతూ తీర్మానం చేసింది. ఇతర ప్రాంతీయులతో ఏ మాత్రం సంప్రదించకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటన ఎంతమాత్రం క్షమార్హం కాదని సీహెచ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివద్ధికోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన జలయజ్ఞం పనులను పూర్తి చేయాలని, అటు తర్వాతే ప్రాంతాల వారీగా చర్చలు నిర్వహించాలని కోరారు.
అప్పటికీ విడిపోవాలనుకుంటే రాయలసీమ రాష్ట్రం కూడా ఇవ్వాల్సిందేనన్నారు. ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ ప్రకటనతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఊహించని స్థాయిలో ఉద్యమం రావడం శుభపరిణామం అన్నారు. గత ఫిబ్రవరి 12న సీఎల్పీ సమావేశం జరిపినప్పుడు దివంగత నేత వైఎస్సార్ తెలంగాణపై కేంద్రం ప్రకటన చేస్తుందని తెలిపారన్నారు. అయితే అన్ని ప్రాంతాల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని సోనియాకు చెప్పినట్లు వైఎస్ వివరించారన్నారు. కానీ ఎందుకో తొందరపాటు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇతర ప్రాంతాల మనోభావాలను తెలుసుకునే వీలు లేకుండా చేయడం సరైంది కాదన్నారు. ప్రస్తుత తరుణంలో సమైక్యాంధ్ర కోసం విజయమో…వీరస్వర్గమో అనే రీతిలో పోరాడాలన్నారు.
ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, లింగారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత మనోభావాలకనుగుణంగా తమవంతుగా పదవులకు రాజీనామాలు సమర్పించామన్నారు. పార్టీలకతీతంగా ఉద్యమించి ఆంధ్రప్రదేశ్ ముక్కలు కాకుండా చూడాలని విన్నవించారు. అంచెలంచెలుగా ఉద్యమం నిర్వహించాలని, ఎవరిస్థాయిలో వారు సమైక్య నినాదం అందుకోవాలన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్రకోసం పాటుపడాలన్నారు. రాయలసీమ ఉద్యమ నేత మాసీమ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇతర ప్రాంతాలతోపాటు వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి కృషి చేస్తే గగ్గోలు పెట్టారన్నారు.
ఉమ్మడి రాష్ట్ర్రంలోనే ద్వేషం, అసూయ వెళ్లగక్కిన తెలంగాణా ప్రాంతీయులు రేపు ఎగువ రాష్ట్రం అయ్యాక ఏమాత్రం సహకరిస్తారని నిలదీశారు. మొదటగా రాయలసీమ ప్రయోజనాలు తీర్చి ఆ తర్వాత రాష్ట్ర విభజనకు కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రమేష్‌రెడ్డి, పీఆర్‌పీ నుంచి హరిప్రసాద్, నజీర్ అహ్మద్, బీజేపీ నుంచి శ్రీనివాసులరెడ్డి, సుబ్బారెడ్డి, పార్థసారధి, లోక్‌సత్తా నుంచి శేషారెడ్డి ఐక్య కార్యచరణ కమిటీ ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తూ మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన కడప జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసేలా నిర్ణయించారు. ఇదిలా ఉండగా పుష్పగిరి పీఠాధిపతి విద్యానృసింహ భారతి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు.
రాష్ట్రం కలిసి ఉంటేనే ప్రయోజనం ఉంటుందని సూచించారు. కాగా మూడవరోజు కూడా జిల్లా వ్యాప్తంగా రాకపోకలు స్తంభించాయి. ఆందోళనకారులకు జడిసి ఆర్టీసీ యంత్రాంగం బస్సులను నడపలేదు. సామాన్య జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పది కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే రూ.20లను చార్జీల రూపంలో ప్రైవేటు వాహనదారులు గుంజారు. నిరవధిక నిరాహార దీక్షలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. యువకులు సెల్‌టవర్లు, విద్యుత్‌స్తంభాలు, మేడలు ఎక్కి నిరసనలు పాటిస్తూ ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. రైల్వేకోడూరు పంచాయితీరాజ్ కార్యాలయంలో వాహనానికి నిప్పంటించే యత్నం చేశారు. యోగివేమన యూనిర్శిటీలో ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ ప్రతినిధులు చంద్రారెడ్డి, సురేష్ నేతత్వంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
అర్ధనగ్న ప్రదర్శనలతో పాటు సోనియా దిష్టిబొమ్మ శవయాత్ర లో రోడ్డుపై పొర్లుకుంటూ నిరసన వ్యక్తం చేశా రు. ఈ ప్రాంత ప్రయోజనాలకోసం ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడమని పేర్కొన్నారు. అవసరమైతే త్యాగాలకు సైతం సిద్ధమవుతామని హెచ్చరించారు. కాగా ముస్లీం మైనార్టీలు, కాంగ్రెస్ మైనార్టీసెల్ జిల్లా ఛైర్మన్ కరీముల్లా నేతృత్వంలో మంత్రి అహ్మదుల్లా రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ముస్లీంల క్షేమాన్ని కాంక్షించి మంత్రి రాజీ నామా చేయాలని ఆయన ఇంటిముందు బైఠాయించారు. శనివారం జిల్లాలో స్వల్ప విధ్వంసకర ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ప్రధాన కూడళ్లలో, ప్రధా న కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలతో ప్రధాన పట్టణాలలో బందోబస్తును పర్యవేక్షించారు. ఐక్య కార్యాచరణ కమిటీ తుదిరూపం దాల్చాక జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.
– సాక్షి
we want united andhra
4 కోట్ల మంది తెలంగాణా ప్రజల్లో ఎంత మంది తెలంగాణా కావాలని
కోరుకుంటున్నారు ….కేవలం వెయ్యి లేదా రెండువేల మంది చోట మోటా నాయకులు
తప్ప ఏ ఆంధ్రుడు కుడా రాష్ట్రం విడిపోవాలని కోరుకోవటం లేదు…..కొందరు
రాజకీయ నిరుద్యోగుల స్వార్ధ పూరిత ప్రయోజనాల కోసం తప్ప ప్రత్యేక రాష్ట్రం
ఏ విధంగా అభివృద్దికి దోహద పడుతుంది …అస్సలు KCR జ్యూస్ తాగిన రోజు
మీడియా సంయమనం పాటించి వుంటే నేడు ఈ దుర్బర పరిస్థితి వచ్చి ఉండేదా ..
నీతి, నిబద్దత లేని ఒక తాగుబోతుని ఇవ్వాల గాంధీ మహాత్ముడి లా కీర్తించే
దుర్దినం వచ్చినందుకు ఒక తెలుగువాడిగా సిగ్గుతో తల
దించుకుంటున్నా…మొదటి నుంచి కుడా తెలంగాణా రాజకీయ నిరుద్యోగుల స్వర్గ
ధామంగా వెలుగొందుతుంది..ఏ ఎదవకి పదవి రాకపోయినా తెలంగాణా పల్లవి
ఎత్తుకుని ప్రజల భావోద్వేగాలతో చలగాట మాడాడు.. తెలంగాణా ఎన్నికలలో పోటీ
చేసే సత్తా కూడా లేని ఒక దగుల్బాచీ రాజకీయ నాయకుడు, గాంధీ మహాత్ముడి లాగ
బహిరంగంగా కీర్తింప బడుతుంటే 10 కోట్ల మంది ఆంధ్రులు సిగ్గుతో
చచ్చిపోతున్నారు……కోట్ల అమంది ఆంధ్రుల మనో భావాలతో సంబంధం లేకుండా
ఢిల్లీ పెద్దలు తీసుకున్న ఈ దౌర్భాగ్యపు నిర్ణయాన్ని తెలుగు వారు అందరు
ప్రతిగటించాలి….
కేవలం 2000 మంది విద్యార్దులు గొడవ చేస్తేనే తెలంగాణా ప్రకటన చేస్తే
లక్షలాది తెలుగు వాళ్ళు ఆందోళన చేస్తే ఎం చేస్తారు …….సమైఖ్యాంధ్ర
కోరుకునే యువతరం అందరికి ఇదే నా మనవి…మన యువ సత్తా జాతి కోసం చాటాలిసిన
తరుణం వచ్చింది…శాంతియుతంగా మన నిరసనని వివిధ రూపాలలో తెలియ
చేద్దాము..తెలుగు జాతి యొక్క ఉనికిని కాపాడుకుందాము……రాజకీయాలకు
అతీతంగా కలిసి పోరాడదాము..తెలుగుజాతి సత్తాను చాటుదాము
మేలుకో యువత ——–కాపాడుకో రాష్ట్ర భవిత
జల ప్రాజెక్టులు అక్కడ (జూరాల,శ్రీశైలం ,సాగర్ )……బీడు భూములు ఇక్కడా ….
బొగ్గు గనులు అక్కడ …….. చిమ్మ చీకట్లు ఇక్కడా …
IT , BT కంపెనీలు , విశ్వ విద్యాలయాలు (IIT , IIIT …) అక్కడ ……మన
విద్యా కుసుమాలు ఎక్కడా ??
అబివృద్ది అక్కడ ……మన మెక్కడా??
పోరాటాలు అక్కడ……మరి మనము ఎక్కడా?