Tourist Attractions

వైఎస్‌ కుటుంబానిది త్యాగం కాదా?

‘ఓదార్పు’ యాత్రకు ఆదరణ పెరిగిన కొద్దీ, విమర్శలూ పెరిగిన సంగతి మనమంతా గమనించాం. సస్పెన్షన్‌ బెదిరింపులు, వృద్ధనేతల వ్యర్థ ప్రేలాపనలు, హూంకరింపుల నడుమ ఓదార్పు యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఇది ఆనందదాయకం. అయితే ఈ యాత్ర ముగింపు ఎన్నో ప్రశ్నలను జనం ముందుకు తెచ్చింది. కొందరు కాంగ్రెస్‌వాదులు నెహ్రూ , ఇందిర కుటుంబం చేసిన త్యాగం గురించి పదేపదే చెబుతున్నారు. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేనేలేదు.

కానీ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పునర్జన్మ ఇచ్చారు. అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే తిరుగులేని ప్రజానేతగా గుర్తింపు పొందారు. ఆఖరికి రచ్చబండ కార్యక్రమానికి వెళుతూనే హెలికాప్టర్‌ కూలి దుర్మరణం పాలైనారు. ఇది వైఎస్‌ కుటుంబం చేసిన త్యాగం కాదా? దీనిని గుర్తించడానికి కాంగ్రెస్‌ పెద్దలకు ఎందుకు అభ్యంతరం? ముప్పయ్‌ సంవత్సరాలు ఆ పార్టీ కోసం విశేషంగా శ్రమించినవారు డాక్టర్‌ వైఎస్‌. 1500 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేశారు. ఇది చరిత్ర.

Read :  జగనే వీరికి పేద్ద విషయం!

YS Jagan Mohan Reddy
YS Jagan

కానీ రాజశేఖరరెడ్డి కుటుంబం మీదే ఇప్పుడు ఆ పార్టీవారే రాళ్లేస్తున్నారు. ప్రతిపక్షాలకు మించి విషం చిమ్ముతున్నారు. ఇది క్షంతవ్యమేనా? చరిత్రను మరచిపోవడం న్యాయమా? జగన్‌ ఆస్తుల మీద దర్యాప్తు అని ఒకరు, వైఎస్‌తోనే పార్టీ గెలిచిందంటే ససేమిరా అంగీకరించనని ఒకరు ఇలా తలా ఒకరీతిలో మాట్లాడుతున్నారు. డాక్టర్‌ వైఎస్‌ కుటుంబం కాంగ్రెస్‌ పార్టీ కోసం జీవించింది. జగన్‌ ఆయన కుమారుడు. కాంగ్రెస్‌ ఎంపీ. కానీ ఏ స్థాయిలో ఉన్నా ప్రతివారికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శించడం వైఎస్‌ కుమారునిగా జగన్‌ కర్తవ్యం.

ప్రాథమిక ధర్మం. మన సొంత కుటుంబానికి ఏ చిన్న హాని జరిగినా ఎంతగానో తల్లడిల్లి పోతాం. అలాంటిది తన తండ్రి మీద గాఢమైన అభిమానంతో సభ్యుడినో, సభ్యురాలినో కోల్పోయిన కుటుంబాల మాటేమిటి? వారి క్షోభ సంగతి పట్టించుకోవలసిన అవసరం లేదా? ఈ యాత్రే చేయకుండా ఉంటే వైఎస్‌ కుటుంబానికి చరిత్రలో ఎంత వెలితి మిగిలిపోయేది? ఏ విధంగా చూసినా యాత్ర సమర్థనీయం. పైగా ఆయన వ్యక్తిగతం.

Read :  Industrialist Obul Reddy passes away

ఈ కోణం నుంచే ఆయన యాత్ర చేయడానికి తన వంతు కృషి చేశారు. కానీ జగన్‌ను ఇరుకున పెట్టడానికి, ఆటంకాలు కలిగించడానికి సీనియర్ల ముసుగులో వృద్ధులు శతవిధాలా యత్నించి తమ అల్పబుద్ధిని చాటుకున్నారు. ఈ ధోరణిని జనం క్షమించరు. పార్టీకి సేవ చేయడమంటే అగ్రనేతలను కాకాపట్టడమేనని మనసా వాచా నమ్మే నాయకులకు ఇప్పుడు కాంగ్రెస్‌లో కొదవలేదు. వీరికి ప్రజలతో సంబంధాలు అక్కరలేదు. పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలు. వీరికి ప్రజలతో మమేకంకావడంలోని హేతుబద్ధతగానీ, అవసరంగానీ అర్థంకాదు.

ప్రజానేతలను గుర్తించే సంస్కృతి, మర్యాద రాష్ట్రంలో ఇలాంటి పెద్దలు ఎప్పుడు నేర్చుకుంటారు? ఓదార్పు యాత్రకు వచ్చిన వారు డబ్బులు ఇస్తే వచ్చారా? ఇలాంటి మాటలతో అవమానించడానికి వారికి నోరెలా వచ్చింది? ఇది ఒక ప్రాంత ప్రజలందరినీ అవమానించడం కాదా? ఇది జైత్రయాత్రలా కనిపించిందట! దండయాత్రవలె ఉన్నదట!! ప్రజాసమూహాల నాడి , మనోగతం ఈ తరహా భజనపరులకు అర్థం కావడం కష్టం. వీరి మాటలనూ, ప్రకటనలనూ ప్రజలు పరిగణనలోకి తీసుకోలేదు. వైఎస్‌ జీవించ ఉండగా కుక్కిన పేనుల్లా పడి ఉన్న వీరి మాటలకు ఇప్పుడు విలువ రాదు.

Read :  కరువుబండ యాత్రలు సీమలో ఆగాలంటే...

ఒకటి వాస్తవం. ఓదార్పు యాత్ర కాంగ్రెస్‌కు ప్రయోజనమే చేకూర్చుతుంది. జనం మధ్యకు రావాలని జగన్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. జననేతగా ఆవిర్భవిస్తున్న నాయకుడిని స్వాగతించడం నేటి రాజకీయ అవసరం.

నల్లమిల్లి జనార్దనరెడ్డి (చంటిరెడ్డి)। అధ్యక్షులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, రామచంద్రపురం, తూర్పు గోదావరి జిల్లా

– సాక్షి దినపత్రిక 

Check Also

District Collectors

Greatness of Kadapa

Kadapa District Specialities and uniqueness from the famous Yogi Vemana University Research Scholars Read :  …

Kadapa Goa

Kadapa to Goa Train Timings

Kadapa to Goa train timings and details of trains. Distance between Kadapa and Goa. Timetable …

2 comments

  1. You added a valuable information for Kadapa dist people
    All the best.

  2. Mahaboob Basha Shaik

    I believe Odarpu Yatra is a good movement from Jagan to let people not forget the deeds of YSR. Since he has died our Andhra has gone back in darkness. Every people lose their hopes. My sincere Advise to all AP people to support jagan Odarpu Yatra!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *