Tourist Attractions

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల 96వ జయంతి

ఆధునిక సాహితీ చరిత్రలో బహుముఖ పాండిత్యం సంపాదించి ప్రాచీన నవీన కవితాయుగాల వారిధిగా నిలిచారు పుట్టపర్తి నారాయణాచార్యులు. భక్తికవితా బంధువు.. అనువాద రచనా సాహిత్యంలో 14 భాషల్లో ప్రవేశ ప్రావీణ్యం ఆయన సొంతం. ఏడు భాషలలో ఆశు కవితామృతాన్ని తెలుగు గుమ్మంలో నిండుగా.. దండిగా పారించారు. నేడు సాహితీ మేరువు 96 జయంతి సందర్భంగా  అందిస్తున్న కథనమిది.

* నారాయణాచార్యులు అనంతపురం జిల్లా చియ్యేడులో 1914 మార్చి 28న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు లక్ష్మిదేవి, శ్రీనివాసాచార్యులు. 12యేట నుంచే సాహితీ ప్రకియ్రకు ఉపక్రమించారు. సంగీత, సాహిత్యాలలో సమ ప్రతిభను ప్రదర్శించిన ప్రతిభాశాలి.

* పేదరికం వెంటాడినా.. సరస్వతీ సమరాధన వీడలేదు. అవధానాలు చేయటంలో అందవేసిన చేయి. ఎక్కువ కాలం ప్రొద్దుటూరులోనే గడిపి అపార సాహిత్యసేవలందించారు. ఆయన రచించిన గేయకావ్యం శివతాండవం సంగీత, సాహిత్య, నాట్య సంకేతాల సమ్మేళనం. మంచి గుర్తింపు పొందింది.

Read :  YS JAGAN MOHAN REDDY - Ex Chief Minister, AP

* పద్య కావ్యాలు : సాక్షాత్కారము, పెనుగొండ లక్ష్మి, షాజీ, గాంధీజీ మహాప్రస్తానము, సిపాయి పితూరీ, శ్రీనివాసం ప్రబంధం. బాష్పతర్పణం.

* గేయ కావ్యాలు : అగ్నివీణ, శివతాండవము, పురోగమనము, మేఘదూతము, జనప్రియ రామాయణం.

* ద్విపద కావ్యం : పండరీ భాగవతం

* నవలలు : ప్రతీకారం, ఉషఃకాలము, రఘునాథనాయకుడు, అభయప్రదానం

* పరిశోధనలు : విజయనగర సామాజిక చరిత్ర, జైనం, బౌద్ధం, భాషా శాస్త్రములు, ప్రాకృత వ్యాసములు, మళయాళ భాషావ్యాసాలు, వసుచరిత్ర సాహతీ సౌరభం, మహాభాగవతోపన్యాసములు, మహాభారత విమర్శనం.

* అందుకున్న బిరుదులు.. : సర్వతీపుత్ర, అభినవ పోతన(1948), వాగ్గేయకారక రత్న(1951), ప్రాకృత కవితా సరస్వతీ(1952), మహాకవి (1953), అభినవ నాచనసోమన(1962), వ్రజభాషాభూషణ(1963), సరస్వతీ తిలక(1964), అత్యుత్తమోపాధ్యాయ(1969), సర్వసంత్ర స్వతంత్ర(1972), పద్మశ్రీ, కవిసార్వభౌమ(1974), డాక్టర్‌ ఆఫ్‌ లెటర్సు(1975), అభినవ కాళిదాస(1976), ఆంధ్రరత్న(1987).

Check Also

Gudur to Kadapa Bus Timings & Schedule

Gudur to Kadapa Bus Timings & Schedule

Find APSRTC bus timings from Gudur to Kadapa. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Gudur and Kadapa.

Kadapa to Gudur Bus Timings & Schedule

Kadapa to Gudur Bus Timings & Schedule

Find APSRTC bus timings from Kadapa to Gudur. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Kadapa and Gudur.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *