Tourist Attractions

Tag Archives: brahmotsavam

నేటి నుండి దేవుని కడపలో వార్షిక బ్రహ్మోత్సవాలు

దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుండి ఈనెల 13వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. 3న తేదీన దీక్ష తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 4న తిరుచ్చి ధ్వజారోహణ, చంద్రప్రభ వాహనం, 5న సూర్యప్రభ వాహనం, పెద్దశేష వాహనం, 6న చిన్న శేషవాహనం, సింహావాహనం, 7న కల్పవృక్షవాహనం, హనుమంత వాహనం, 8న సర్వభూపల వాహనం, గరుడవాహనం, 9న

Read More »

భక్తులతో పోటెత్తిన పుష్పగిరి

పుణ్యక్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగిన అక్షయ తృతీయ ఉత్సవాలకు హాజరైన భక్తులతో పుష్పగిరి పోటెత్తింది. పంచనదీ సంగమమైన పెన్నానదిలో సంకల్ప పూర్వకంగా స్నానమాచరించి అక్షయ తృతీయ రోజున శివకేశవులను భక్తితో పూజిస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుందని పురాణ గాథ. దీంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి వార్లను దర్శించి కాయకర్పూరాలు సమర్పించారు.

Read More »

29నుంచి పులివెందుల రంగనాథుని బ్రహ్మోత్సవాలు

పులివెందుల : పులివెందులలోని శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ  ఈఓ జి.వి.రాఘవరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 2న గరుడ వాహన సేవ, 3న కల్యాణోత్సవం, 4న బ్రహ్మరథోత్సవం ఉంటాయన్నారు. తొలిరోజు పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామి వారిని ఊరేగిస్తారన్నారు. 30వ తేదీన సింహావాహనం, 31న శేష వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.

Read More »

దేవునికడపలో వైభవంగా ధ్వజారోహణం

దేవునికడప శ్రీలక్షీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవరోజైన శనివారం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల నుంచి వచ్చిన వేదపండితులు, శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేశారు.

Read More »