Tourist Attractions

ముత్తులూరుపాడులో బుక్కరాయల కాలం నాటి శాసనం లభ్యం!

కడప జిల్లా ఖాజీపేట మండలం ముత్తులూరుపాడులో తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ విజయనగర ప్రభువైన బుక్కరాయల కాలం నాటి అరుదైన శాసనాన్ని కనుగొంది. గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న ఈ శాసనాన్ని తెలుగు సంస్థ గౌరవాధ్యక్షుడు తవ్వా ఓబుల్ రెడ్డి, ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ఏ.వీరాస్వామి, కార్యదర్షి ముండ్లపాటి వెంకట సుబ్బయ్య, సహాయ కార్యదర్శి ధర్మిసెట్టి వెంకట రమణయ్య  నెల రోజుల కిందట గుర్తించారు. ఈ శాసనం చాయా చిత్రాన్ని తీసుకుని కడప లోని బ్రౌన్ తెలుగు పరిశోధనా కేంద్రం  పరిశోధకులు కట్టా నరశిం హులు దృష్టికి తీసుకెళ్ళడం తో మైసూరు, చెన్నై లకు చెందిన భారత పురావస్తు శాఖ శాసనాల విభాగపు అధికారులు  2010 జనవరి 11 వ తేదీన  ముత్తులూరు పాడు కు వచ్చి శాసనాన్ని పరిశీలించారు. శక సంవత్సరం 1287 ( క్రీ. శ. 1365) కాలం నాటి శాసనంగా వారు ఈ శాసనాన్ని గుర్తించారు.  భారత పురావస్తు శాఖ వార్షిక ప్రచురణలో ఈ శాసనం వివరాలను ప్రచురిస్తామని వారు తెలిపారు. గ్రామానికి చెందిన వారు అప్పట్లో మల్లికార్జున, భోగనాధ దేవరలకు భూమిని దానం గా ఇచ్చినట్లుగా ఈ శాసనంలో లిఖించారు.

Read :  Buddha Vihara found in Konduru Tippa

చిత్రం: ఈనాడు దిన పత్రిక వార్తాంశం. 12 జనవరి 2010.

mpadu

Check Also

ys sharmila nomination

YS Sharmila Submits Nomination for Kadapa Lok Sabha Seat

Kadapa: YS Sharmila Reddy, the All India Congress Committee (APCC) chief, filed her nomination for …

Mydukur to Nellore

APSRTC Bus Timings – Anantapur to Kadapa

Anantapur – Kadapa bus timings, fare, schedule. APSRTC Bus timings, fare details, distance, route and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *