కడప: కడపలో నవంబర్ 22 నుంచి 25 వరకు అఖిలభారత స్థాయి చెస్ పోటీలు అఖిలభారత చదరంగ సమాఖ్య, రాష్ట్ర సమాఖ్య అనుమతితో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి గల క్రీడాకారులు తమ ఎంట్రీలను నవంబర్ 15వ తేదీలోగా పంపించాలి. నవంబరు 16 నుంచి 20 వరకు 200 అపరాధ రుసుం చెల్లించి పేర్లను (ఎంట్రీలను) నమోదు చేసుకోవచ్చు.
కడప కళాక్షేత్రంలో మహాత్మగాంధీ అఖిల భారత స్థాయి చెస్ పోటీలను కడప జిల్లా చెస్ సంఘ సహకారం ఆధ్వర్యంలో అధికార పూర్వకంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో విజేతలకు లక్ష రూపాయలను నగదు బహుమతులు కింద అందజేయనున్నారు. సిటీ పర్నిచర్స్ సంస్థ ఈ పోటీలకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. పూర్తి వివరాలను అఖిలభారత చదరంగ సమాఖ్య వెబ్‌సైట్ (www.indianchessfed.org) లో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
2000 లోపు రేటింగ్ కలిగిన వారు మాత్రమే ఈ పోటీలలో పాల్గొనటానికి అర్హులు. పోటీలను స్విస్‌లీగ్ పద్ధతిలో ఫైడ్ నియమ నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు.
టోర్నమెంటు డైరెక్టర్‌గా రాష్ట్ర సంఘ సీనియర్ ఉపాధ్యక్షులు మేజర్ కె.ఎ.శివప్రసాద్, కార్యనిర్వాహాక అధ్యక్షులుగా కె.రవికుమార్, జిల్లాకార్యదర్శి టోర్నమెంటు ఛైర్మన్‌గా రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఎ.నరసింహారెడ్డి, కో-ఆర్డినేటర్‌గా కె.కన్నారెడ్డి, డి.వి. సుందరం వ్యవహరిస్తారు.
మరిన్ని వివరాలకు కార్యనిర్వాహక కార్యదర్శులను కింది నెంబర్లలో సంప్రదించవచ్చు:
షేక్ రబ్బనీబాషా – 9290285544
షేక్, గౌస్ బాషా – 9866999879
విజయ్‌కుమార్ అగర్వాల్ – 9948715153