మైదుకూరు: మాతృభాష పరిరక్షణ కోసం తెలుగు వారమంతా ఉద్యమించ్చాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి పిలుపిచ్చారు. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన ధర్నా కు ఆయన అధ్యక్షత వహిస్తూ తెలుగు భాష పరిరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
Read More »వీరబ్రహ్మేంద్రస్వామి ప్రతిష్టించిన అల్లాడుపల్లె వీరభద్ర స్వామి
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర యోగీంద్రులు స్వయంగా శిల్పించి, ప్రతిష్టించిన శ్రీ వీరభద్ర స్వామి అల్లాడుపల్లె క్షేత్రంలో వెలిసి, భక్తులకు కొంగుబంగారంగా నిలిచారు. రాయలసీమతో పాటు కర్నాటక ప్రాంతం నుండీ కూడా భక్తులు తరలి వచ్చి పవిత్ర కుందూనది ఒడ్డున వెలసిన శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకుంటూ ఉంటారు. శైవ క్షేత్రమైన అల్లాడుపల్లె మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ...
Read More »వేమన సర్వస్వానికి యో.వే.విశ్వవిద్యాలయం వేదిక కావాలి- అచార్య కేతు విశ్వనాథరెడ్డి
కడప, జనవరి19: ప్రజాకవి వేమనకు సంబంధించిన సకల సమాచారాన్నీ, సాహిత్యాన్నీ సేకరించి కడపలోని వేమన విశ్వవిద్యాలయంలో సంగ్రహాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథా రచయిత, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అచార్య కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎర్రముక్కపల్లిలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజాకవి యోగివేమన జయంత్యుత్సవ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ జనరంజకమైన వేమన పద్యాలకు ప్రామాణిక ప్రతులను కూడా ప్రచురించాల్సిన అవసరం ఉందన్నారు.
Read More »