దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్లు డివిజను నుంచి ప్రతి ఏటా భారీగా ఆదాయం లభిస్తోంది. అయినా ప్రతి రైల్వే బడ్జెట్టులో డివిజనుకు అన్యాయమే జరుగుతోంది. ప్రత్యేకించి కడప జిల్లాకు మొండి చేయి మిగులుతోంది. గత రైల్వే బడ్జెట్టులో గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లు కేటాయింపులు జరిగాయి. ఈ సారి బడ్జెట్టులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో దిక్కుతోచడం లేదు. భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సాయిప్రతాప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కడప జిల్లాకు మేలు జరిగేలా చూడాల్సి ఉంది.
Read More »మైదుకూరు,పోరుమామిళ్ళ,బద్వేలు ప్రజలకు తీరనున్న రైలు కల!
తాజాగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కడప జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ళ, కలసపాడు ప్రాంతాల ప్రజలకు ఇప్పటిదాకా ఒక కలగా మిగిలిన రైలుసౌకర్యం సమీప భవిష్యత్తులో నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న ప్రొద్దుటూరు-కంభం, లైను సర్వేకు ఆమోదం తెలపడంతో పాటు తాజాగా గిద్దలూరు-భాకరాపేట(భాకరాపేట స్టేషన్ కడప-రేణిగుంట లైనుపై కడప-ఒంటిమిట్ట స్టేషన్ల
Read More »