దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్లు డివిజను నుంచి ప్రతి ఏటా భారీగా ఆదాయం లభిస్తోంది. అయినా ప్రతి రైల్వే బడ్జెట్టులో డివిజనుకు అన్యాయమే జరుగుతోంది. ప్రత్యేకించి కడప జిల్లాకు మొండి చేయి మిగులుతోంది. గత రైల్వే బడ్జెట్టులో గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లు కేటాయింపులు జరిగాయి. ఈ సారి బడ్జెట్టులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో దిక్కుతోచడం లేదు. భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సాయిప్రతాప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కడప జిల్లాకు మేలు జరిగేలా చూడాల్సి ఉంది.
Read More »శతావధాని సీవీ సుబ్బన్నకు లోక్‌నాయక్ పురస్కారం
విశాఖలోని లోక్‌నాయక్ ఫౌండేషన్ అందించే విశిష్ట పురస్కారానికి ఈ దఫా ప్రముఖ సాహితీవేత్త, శతావధాని సి.వి.సుబ్బన్న ఎంపికయ్యారు. సి.వి.సుబ్బన్న స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతం.తెలుగు సాహిత్య వికాసంలో విశేష కృషిచేసినవారికి ఏటా ఈ విశిష్ట పురష్కారం అందచేస్తారు. విశాఖనగరం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతులమీదుగా పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ఫౌండేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.
Read More »