రాజ్యాంగదత్తమైన పర్యటన హక్కుపైన తెలంగాణ వాదం పేరుతో ఉక్కుపాదం మోపారు. ప్రజాస్వామ్య హననానికి సాహసించారు. వ్యక్తి స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అధికారగణం, ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. నిన్నమొన్నటివరకు నక్సలైట్ల నిషేధానికి బెదిరి నియోజకవర్గాలలో తిరగడానికి భయపడిన వారే ఇప్పుడు నక్సలైట్లను తలదన్నేలా నిషేధాలకు దిగుతున్నారు.నిన్నటి వరకు జగన్ ను మాత్రమే అడ్డుకుంటామని చెప్పుకున్న ముసుగు ఉద్యమకారులు నేడు ఒకడుగు ముందుకేసి సమైక్యవాదులందరినీ తెలంగాణలో అడుగు పెట్టనివ్వమంటున్నారు.
Read More »
www.kadapa.info Voice of the YSR Kadapa District