కడప : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో కడప జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరులోని మిట్టమడి వీధికి చెందిన భారతి అనే మహిళ 59 ర్యాంకు సాధించడం పట్ల ప్రొద్దుటూరు వాసుల్లో హర్షం వెల్లివిరుస్తోంది. ఈమె భర్త సీవీ.శివశంకర్‌రెడ్డి హైదరాబాద్‌లో పర్యాటక శాఖ కార్యాలయంలో అధికారిగా పని చేస్తున్నారు. కర్ణాటకలోని బెల్గాం ప్రాంతానికి చెందిన భారతి 2007 జనవరి 25న శంకర్‌రెడ్డిని వివాహం చేసుకుంది.
Read More »కడప నుండి కలెక్టరేట్ వరకూ …. తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్
కడప జిల్లాకు చెందిన ప్రభాకర్ రావు ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో కార్మిక ఉపాధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పదవీ భాద్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వంలో ఇప్పటి వరకు వివిధ హోదాలలో పనిచేసిన ఈ వైద్య పట్టభద్రుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనే నిజమైన సంతప్తి ఉందంటారు. దక్షిణ ఆర్కాట్ జిల్లా కలెక్టర్‌గా, హౌసింగ్ కార్పోరేషన్ సిఎండిగా, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఇలా పలు కీలక బాధ్యతలను ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు.కరువు జిల్లా నుండి కలెక్టరేట్ చేరే క్రమంలో ఆయన ఎంతో నేర్పును, ఓర్పును ప్రదర్శించారు.
Read More »కడప జిల్లా వాసికి పద్మవిభూషణ్ పురస్కారం!
కడప: రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్, కడప జిల్లాకు చెందిన యాగా వేణు గోపాల్ రెడ్డికి భారత ప్రభుత్వం సోమవారం దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ను ప్రకటించింది. కడప జిల్లా రాజంపేట సమీపంలోని పుల్లంపేట మండలం కొమ్మనవారి పల్లెలో 1941 ఆగస్ట్ 17 వ తేదీన జన్మించిన వేణుగోపాల్ రెడ్డి మద్రాసు యూనివర్సిటి నుంచి ఎం.ఏ. ఎకనామిక్స్, ఉస్మానియా యూనివర్సిటి నుంచి పిహెచ్ డి పట్టాలను పొందారు. 1964 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రిజర్వు బ్యాకు గవర్నర్ …
Read More »