కడప జిల్లాకు చెందిన ప్రభాకర్ రావు ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో కార్మిక ఉపాధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పదవీ భాద్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వంలో ఇప్పటి వరకు వివిధ హోదాలలో పనిచేసిన ఈ వైద్య పట్టభద్రుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనే నిజమైన సంతప్తి ఉందంటారు. దక్షిణ ఆర్కాట్ జిల్లా కలెక్టర్‌గా, హౌసింగ్ కార్పోరేషన్ సిఎండిగా, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఇలా పలు కీలక బాధ్యతలను ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు.కరువు జిల్లా నుండి కలెక్టరేట్ చేరే క్రమంలో ఆయన ఎంతో నేర్పును, ఓర్పును ప్రదర్శించారు.
Read More »