ప్రచారానికి ఆమడదూరం ఉంటూ.. విద్యాసేవలో మాత్రం ఎవరికీ అందనంత ముందున్నారు, డాక్టర్ సీఎస్ రెడ్డి. ప్రతిభ ఉండి, పేదరికం కాకరణంగా ఉన్నత విద్యకు నోచుకోని పలువురు విద్యార్థుల గురించి తెలుసుకున్న కమలాపురం మండలం మొలుకోనిపల్లెకు చెందిన డాక్టర్ సీఎస్.రెడ్డి మిత్రులతో కలిసి అమెరికాలో ఉండగానే, ఫౌండేషన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ పేరిట 2000లో ట్రస్టును ఏర్పాటు చేశారు.
ట్రస్టు పేరుతో బెంగళూరు ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా విద్యార్థులకు సేవలందించడం మొదలుపెట్టారు.
డాక్టర్ సీఎస్.రెడ్డి 1934 డిసెంబరు 30న జన్మించారు. హైస్కూలు చదువు కమలాపురంలో పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా పలు కళాశాలల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు. కడప కేఎస్‌ఆర్‌ఎం ఇంనీరింగ్ కళాశాలలో 1980 నుంచి 2000 వరకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఎస్వీయూ సెనెట్ సభ్యుడిగా, అకడమిక్ సభ్యుడిగా పనిచేశారు. కడప లోకల్ సెంటర్‌లో చైర్మన్‌గా 1994 నుంచి 1996 వరకు సేవలందించారు.
ప్రతిభ ఉండి, పేదరికం కాకరణంగా ఉన్నత విద్యకు నోచుకోని పలువురు విద్యార్థుల గురించి తెలుసుకున్న సీఎస్ రెడ్డి మిత్రులతో కలిసి అమెరికాలో ఉండగానే, ఫౌండేషన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ పేరిట 2000లో ట్రస్టును ఏర్పాటు చేశారు. ట్రస్టు పేరుతో బెంగళూరు ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా విద్యార్థులకు సేవలందించడం మొదలుపెట్టారు.
కాలిఫోర్నియాలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఎ.జయరామిరెడ్డి ఉపకార వేతనాలకు అవసరమైన విద్యార్థులను ఎంపిక చేస్తారు. తుది ఎంపిక తర్వాత డాక్టర్ సీఎస్ రెడ్డి విద్యార్థులకు నిర్ణయించిన మొత్తాన్ని అందజేస్తారు. ట్రస్టు ప్రారంభంలో హైస్కూలు విద్యార్థులతో మొదలుపెట్టారు. తరువాత క్రమంగా ఉపకారవేతనాలు ఎక్కువగా అవసరం ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు మాత్రమే సహాయమందిస్తున్నారు.
ఏటా 15 మంది విద్యార్థులకు ఈ సహాయం అందుతోంది. ఈ పది సంవత్సరాల్లో మొత్తం 124 మంది విద్యార్థులకు రూ. 16,09,215 ఉపకార వేతనాలుగా అందజేశారు.