Tourist Attractions

News

రాయలసీమకు ఏమిచ్చింది శ్రీబాగ్‌!

సీమలో సాగుయోగ్యమైన భూమిలో కేవలం 7 శాతానికి మాత్రమే నికర జలాలు అందుతున్నాయి. అదే కోస్తాలో 80 శాతం భూమికి నికర జలాలు అందుతాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు ద్వారా కొంత వరదనీటిని సీమ అవసరాలకు తీసుకొంటుంటే తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంత నాయకులు ఏకమై వ్యతిరేకించారు. కనీసం ఇప్పుడైనా రాయలసీమ నాయకులు ప్రత్యేక రాష్ట్రాల గొడవలతో సంబంధం లేకుండా మొదట శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమ హక్కుల కోసం ...

Read More »

నాడు వైఎస్‌.. నేడు జగన్‌..

'వైఎస్‌ను తలుచుకుంటే దుఃఖం పొంగి పొర్లుకొస్తోంది.. నేను తనువు చాలిస్తే నా విగ్రహాన్ని కూడా (వైఎస్‌ కాంస్య విగ్రహం వైపు చూపుతూ) నా స్నేహితుని పక్కనే ఉంచాలని ప్రార్థిస్తున్నా. ఈ కోరికను ఇక్కడున్న యువకులు, జగన్‌మోహన్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు తీర్చాలి' అని సాయిప్రతాప్‌ అన్నారు. నాయకునికి ఏ విధమైన లక్ష్యాలు ఉండాలనే విషయంతో పాటు, మహానేత చరిత్ర కూడా రాబోయే రోజుల్లో యువతకు తెలిసేలా శిలాఫలకాలపై చెక్కించాలన్నారు. ఆ ఫలకాల్లో రాజశేఖరుని చరిత్ర చదివి యువత ఆ బాటలో పయనించాలనేది తన కోర్కె అని సాయిప్రతాప్‌ అన్నారు.

Read More »

Kadapa police now on web

Kadapa Superintendent of Police D.S. Chauhan launched a website of Kadapa police at the District Police Office here on Tuesday. On the website www.kadapapolice.org, people can lodge a complaint, ascertain the status of the complaint and ‘Dial Your SP’ petitions, the status of passport verification and “contact us”. The list of policemen who laid their lives in maintenance of law and order and the list of wanted criminals can be viewed, Mr. Chauhan said to

Read More »

కడప-బెంగళూరు రైల్వే లైను నిధుల కోసం జగన్ చొరవ!

స్వాతంత్ర్యానంతరం రాయలసీమలో రైల్వే సౌకర్యాల విషయంలో జరిగిన అన్యాయాలను మళ్ళీ సమీక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నం అవుతోంది. మరో నెల రోజుల్లో రైల్వే బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర యువనేత, కడప పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సీమకు రైల్వే నిధుల సాధనకు పూనుకున్నారు. గతంలో కూడా సీమలో రైల్వే సమస్యల విషయంలో రైల్వే మంత్రులకు అందచేసిన వినతులు బుట్టదాఖలా అయిన విషయాన్ని మరిచిపొరాదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి కలలుగన్న రాయలసీమ రైల్వే సదుపాయాల సాధనకు యువనేత జగన్ ఉద్యమించాల్సిన …

Read More »

వై.ఎస్ హెలికాప్టర్ దుర్ఘటన నివేదిక పై పత్రికల విశ్లేషణలు.

ముఖ్య మంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంఘటన కడప జిల్లా ప్రజలకు చరిత్రలో అత్యంత దురదృష్టకరమైనది. ఆ మహా నేత మృతిపై అనేక అనుమానాలు ప్రజల్లో నెలకొనిఉన్నాయి. ఆయన ప్రమాదం వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉండొచ్చునన్న అనుమానాలు ప్రజల మనస్సులను తొలుస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన నాలుగు నెలలా పద్దెనిమిది రోజులకు ఆర్‌.కె.త్యాగి నేతృత్వంలోని డీజీసీఏ కమిటీ ఇచ్చిన నివేదిక  పై పత్రికల్లో గత రెండు మూడు రోజులుగా అనేక విశ్లేషణాత్మక …

Read More »

కడప జిల్లా వాసికి పద్మవిభూషణ్ పురస్కారం!

కడప: రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్, కడప జిల్లాకు చెందిన యాగా వేణు గోపాల్ రెడ్డికి భారత ప్రభుత్వం సోమవారం దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం  పద్మవిభూషణ్ ను ప్రకటించింది.  కడప జిల్లా రాజంపేట సమీపంలోని పుల్లంపేట మండలం కొమ్మనవారి పల్లెలో  1941 ఆగస్ట్ 17 వ తేదీన జన్మించిన వేణుగోపాల్ రెడ్డి మద్రాసు యూనివర్సిటి నుంచి ఎం.ఏ. ఎకనామిక్స్, ఉస్మానియా యూనివర్సిటి నుంచి పిహెచ్ డి పట్టాలను పొందారు. 1964 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రిజర్వు బ్యాకు గవర్నర్ …

Read More »

29నుంచి పులివెందుల రంగనాథుని బ్రహ్మోత్సవాలు

పులివెందుల : పులివెందులలోని శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ  ఈఓ జి.వి.రాఘవరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 2న గరుడ వాహన సేవ, 3న కల్యాణోత్సవం, 4న బ్రహ్మరథోత్సవం ఉంటాయన్నారు. తొలిరోజు పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామి వారిని ఊరేగిస్తారన్నారు. 30వ తేదీన సింహావాహనం, 31న శేష వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.

Read More »

పోట్ల గిత్తను మరపిస్తున్న పొట్టేలు

కడప, జనవరి 20: కడప లోని చిన్నచౌకు బైపాస్‌లో వుంటున్న పోట్లగిత్తను మరిపింపచేసే  ఓ పొట్టేలు సాహసాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతేకాదు సుమా ఆ యజమాని ఎక్కడికి వెళ్లినా అతని వెంటే వెళ్ళడంతో పాటు తెల్లారిందని గుర్తు చేస్తూ యజమానిని, కుటుంబ సభ్యులను నిద్దుర లేపుతూ తనవంతు సాయం చేస్తోంది. దీంతో ఆ కుటుంబం ఆ పొట్టేలుపై ఎంతో మక్కువ పెంచుకున్నారు. 

Read More »

వేమన సర్వస్వానికి యో.వే.విశ్వవిద్యాలయం వేదిక కావాలి- అచార్య కేతు విశ్వనాథరెడ్డి

కడప, జనవరి19: ప్రజాకవి వేమనకు సంబంధించిన సకల సమాచారాన్నీ, సాహిత్యాన్నీ సేకరించి కడపలోని వేమన విశ్వవిద్యాలయంలో సంగ్రహాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథా రచయిత, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అచార్య కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎర్రముక్కపల్లిలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజాకవి యోగివేమన జయంత్యుత్సవ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ జనరంజకమైన వేమన పద్యాలకు ప్రామాణిక ప్రతులను కూడా ప్రచురించాల్సిన అవసరం ఉందన్నారు.

Read More »

దేవునికడపలో వైభవంగా ధ్వజారోహణం

దేవునికడప శ్రీలక్షీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవరోజైన శనివారం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల నుంచి వచ్చిన వేదపండితులు, శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేశారు.

Read More »