కడప, 25 ఫిబ్రవరి: యోగి వేమన విశ్వవిద్యాలయానికి 2010-11 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా రూ. 7 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. దీంతో విశ్వవిద్యాలయంలోని రెండవ దశ అభివృద్ధి పనులు అటకెక్కే పరిస్థితి నెలకొంది. ఈ కేటాయింపుల వల్ల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దు స్థితి ఉత్పన్నం కానుంది.
Read More »తెలుగు భాష పరిరక్షణకు ఉద్యమిద్దాం! రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి
మైదుకూరు: మాతృభాష పరిరక్షణ కోసం తెలుగు వారమంతా ఉద్యమించ్చాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి పిలుపిచ్చారు. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన ధర్నా కు ఆయన అధ్యక్షత వహిస్తూ తెలుగు భాష పరిరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
Read More »నవ్వుల ఱేడు పద్మనాభం ఇక లేరు
ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం (79) ఇక లేరు. శనివారం ఉదయం గుండెపోటుతో ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన …
Read More »YS Vijayalakshmi took oath as MLA
Y. S. Vijayalakshmi, widow of former Chief Minister Y. S. Rajasekhara Reddy took oath as the Member of Legislative Assembly on Thursday.Flanked by her son and Kadapa MP Y. S. Jagan Mohan Reddy and senior Congress leaders including APCC chief D. Srinivas, YSR’s close aide K.V.P. Ramachandra Rao, the Pulivendula MLA ...
Read More »Ramachandra Reddy: ViceChancellor for second term
Prof. Arjula Ramachandra Reddy, Fellow of Indian Academy of Sciences and first Vice-Chancellor of Yogi Vemana University has taken over as Vice-Chancellor for a second term of three years on Wednesday.He is serving as Member, National Task Force on Agri-Biotechnology and Member, Review Committee on Genetic Manipulation of Department of Biotechnology in the Union Ministry of Science and Technology.
Read More »నాడు వైఎస్.. నేడు జగన్..
'వైఎస్‌ను తలుచుకుంటే దుఃఖం పొంగి పొర్లుకొస్తోంది.. నేను తనువు చాలిస్తే నా విగ్రహాన్ని కూడా (వైఎస్ కాంస్య విగ్రహం వైపు చూపుతూ) నా స్నేహితుని పక్కనే ఉంచాలని ప్రార్థిస్తున్నా. ఈ కోరికను ఇక్కడున్న యువకులు, జగన్‌మోహన్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు తీర్చాలి' అని సాయిప్రతాప్ అన్నారు. నాయకునికి ఏ విధమైన లక్ష్యాలు ఉండాలనే విషయంతో పాటు, మహానేత చరిత్ర కూడా రాబోయే రోజుల్లో యువతకు తెలిసేలా శిలాఫలకాలపై చెక్కించాలన్నారు. ఆ ఫలకాల్లో రాజశేఖరుని చరిత్ర చదివి యువత ఆ బాటలో పయనించాలనేది తన కోర్కె అని సాయిప్రతాప్ అన్నారు.
Read More »కడప-బెంగళూరు రైల్వే లైను నిధుల కోసం జగన్ చొరవ!
స్వాతంత్ర్యానంతరం రాయలసీమలో రైల్వే సౌకర్యాల విషయంలో జరిగిన అన్యాయాలను మళ్ళీ సమీక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నం అవుతోంది. మరో నెల రోజుల్లో రైల్వే బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర యువనేత, కడప పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సీమకు రైల్వే నిధుల సాధనకు పూనుకున్నారు. గతంలో కూడా సీమలో రైల్వే సమస్యల విషయంలో రైల్వే మంత్రులకు అందచేసిన వినతులు బుట్టదాఖలా అయిన విషయాన్ని మరిచిపొరాదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి కలలుగన్న రాయలసీమ రైల్వే సదుపాయాల సాధనకు యువనేత జగన్ ఉద్యమించాల్సిన …
Read More »కడప జిల్లా వాసికి పద్మవిభూషణ్ పురస్కారం!
కడప: రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్, కడప జిల్లాకు చెందిన యాగా వేణు గోపాల్ రెడ్డికి భారత ప్రభుత్వం సోమవారం దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ను ప్రకటించింది. కడప జిల్లా రాజంపేట సమీపంలోని పుల్లంపేట మండలం కొమ్మనవారి పల్లెలో 1941 ఆగస్ట్ 17 వ తేదీన జన్మించిన వేణుగోపాల్ రెడ్డి మద్రాసు యూనివర్సిటి నుంచి ఎం.ఏ. ఎకనామిక్స్, ఉస్మానియా యూనివర్సిటి నుంచి పిహెచ్ డి పట్టాలను పొందారు. 1964 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రిజర్వు బ్యాకు గవర్నర్ …
Read More »29నుంచి పులివెందుల రంగనాథుని బ్రహ్మోత్సవాలు
పులివెందుల : పులివెందులలోని శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ ఈఓ జి.వి.రాఘవరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 2న గరుడ వాహన సేవ, 3న కల్యాణోత్సవం, 4న బ్రహ్మరథోత్సవం ఉంటాయన్నారు. తొలిరోజు పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామి వారిని ఊరేగిస్తారన్నారు. 30వ తేదీన సింహావాహనం, 31న శేష వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.
Read More »వేమన సర్వస్వానికి యో.వే.విశ్వవిద్యాలయం వేదిక కావాలి- అచార్య కేతు విశ్వనాథరెడ్డి
కడప, జనవరి19: ప్రజాకవి వేమనకు సంబంధించిన సకల సమాచారాన్నీ, సాహిత్యాన్నీ సేకరించి కడపలోని వేమన విశ్వవిద్యాలయంలో సంగ్రహాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథా రచయిత, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అచార్య కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎర్రముక్కపల్లిలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజాకవి యోగివేమన జయంత్యుత్సవ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ జనరంజకమైన వేమన పద్యాలకు ప్రామాణిక ప్రతులను కూడా ప్రచురించాల్సిన అవసరం ఉందన్నారు.
Read More »
www.kadapa.info Voice of the YSR Kadapa District