కడప: వైఎసార్ జిల్లా జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట సమీపంలోని గుహ ల్లో ఆదిమానవుడు చిత్రలేఖనం వెలుగులోకి వచ్చింది. ఎంపీడీవో మొగలిచండు సురేష్ ఆధ్వర్యంలో భారత జాతీయ కళ సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్), భారతీయ పురాతత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన గాలింపులో ఈ అద్భుత రేఖా చిత్రాలు వెలుగుచూశాయి. అజంతా, ఎల్లోరా గుహల్లోనే ఆదిమానవుడు సంచరించి నట్లుగా ఇప్పటి వరకు చరిత్ర చెబుతుండగా జిల్లాలో కూడా ఆదిమానవుడు నివాసం ఉన్న వాస్తవం ప్రపంచానికి తెలియడంలో అద్భుతం ఆవిష్కరించినట్ల యింది. ముద్దనూరు మండలంలో రాచరికపు నాటి దేవా లయాలు, శాసనాలు ఉన్నట్లు ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి. చింతకుంట సమీపంలో ఆదిమానవుడి రేఖా చిత్రాలున్నట్లు ప్రభుత్వ గెజిట్‌లో కూడా పొందుపరిచారు. గత మూడు సంవత్సరాలుగా ఇంటాక్ సంస్థ ఈ రేఖా చిత్రాలకై వెతుకులాట ప్రారంభించింది. ఈ ఆధారాలలో ఇంటాక్ సభ్యులు, పురాతత్వ శాఖ సహాయ సంరక్షకులు, కృషి చేసి కొండ గుహల్లో, దట్టమైన చెట్ల మధ్య, గుబురు పొదల మాటున, సముద్ర మట్టానికి దాదాపు 300 మీటర్ల ఎత్తులో ఉన్న గుహల్లో ఈ చిత్రాలను కనుగొన్నారు. 20 రేఖాచిత్రాలు వెలుగుచూశాయి. ఈ చిత్రాలు ఆదిమానవుడు వేసినవేనని భారతీయ పురాతత్వ సర్వేక్షణ సహాయ సంరక్షకులు అల్లూరి సత్యం, ఇంటాక్ సభ్యులు ధృవీకరించారు. చిత్రాలు గీసిన అత్యంత సమీపంలోనే ఆదిమానవుడు విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా పరుపులాగ మలచిన రాయి కనిపించింది. అడవి జంతు వులను పోలిన రేఖాచిత్రాలు, వేటాడే మనిషి, పరస్పరం విల్లంబులు సంధించే ఇరువురు వ్యక్తులు, స్త్రీ పురుషుల కలయిక పోలిన చిత్రాలు ఈ ప్రదేశంలో కనిపిం చాయి.