Tourist Attractions

పోలీసుల అదుపులో వైఎస్‌ జగన్‌

వంగపల్లి : వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణవార్త జీర్ణించుకోలేని మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వరంగల్‌ జిల్లాకు త్వరలోనే మళ్లీ వస్తానని కడప ఎంపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వంగపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద ఆయన్ని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా జగన్‌ మీడియాతో మాట్లాడుతూ… బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లటమే తప్పా అని ప్రశ్నించారు. ఇటువంటి క్షుద్ర రాజకీయాలను చేయటం అనేది ఎంత వరకూ సమంజసమో రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలన్నారు.

వందమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు దాడి చేయటం వల్ల తనను అరెస్ట్‌ చేసి తీసుకువెళ్లటం ఎంతవరకూ సబబు అని జగన్‌ ప్రశ్నించారు. తను చేపట్టిన ఓదార్పు యాత్రను టీఆర్‌ఎస్‌ రాజకీయం చేసిందన్నారు. చనిపోయిన 77 కుటుంబాల్లో ఎక్కువమంది దళితులేనన్నారు. వారంతా నిరుపేద కుటుంబాలన్నారు. వరంగల్‌ జిల్లాలో తన పర్యటన ఆగిపోతుందేమోననే గుండె ఆగిన యాదగిరి, ఎల్లయ్యలకు తాను సమాధానం చెప్పుకోవాలన్నారు. తన యాత్రను అడ్డుకుంటానన్న టీఆర్‌ఎస్‌ నేతలైన హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, కోదండరామ్‌లు మహబూబాబాద్‌కు కానీ, వరంగల్‌ జిల్లాకు గానీ చెందినవారా అని జగన్‌ ప్రశ్నించారు.

Read :  అసౌకర్యాల నడుమ దేవునికడప బ్రహ్మోత్సవాలు

బయటవారిని తీసుకువచ్చి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. రైల్వేస్టేషన్‌ వెయిటింగ్‌ రూమ్‌లో ఉన్న ఎమ్మెల్యేలపై రాళ్లదాడి చేయటం ఎంతవరకూ సరైనదని జగన్‌ అన్నారు. వారి ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. తనను పోలీసులు ఇప్పుడు అరెస్ట్‌ చేసి తీసుకువెళ్లినా సమయం అనుకూలించాక బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మళ్లీ వస్తానని జగన్‌ స్పష్టం చేశారు.

జగన్‌ అరెస్ట్‌ సరికాదు: లగడపాటి

ఓదార్పు యాత్రకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేయటం సరికాదని విజయవాడ కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌ అన్నారు. మహబూబాబాద్‌ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్యతో చర్చిస్తానన్నారు. మండే సూర్యుడు లాంటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడుని అరెస్ట్‌ చేయటం సామాన్యమైన విషయం కాదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా, అల్‌ఖైదా నడుస్తుందా అని లగడపాటి ప్రశ్నించారు.
 ‘శాంతి భద్రతల దృష్ట్యా జగన్‌ అరెస్ట్‌’: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి
 
మహబూబాబాద్‌ ఘటనకు సంబంధించిన పరిణామాలను ముఖ్యమంత్రి రోశయ్య వివరించినట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శాంతిభద్రతల దృష్ట్యా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రివెంటివ్‌ కస్టడీలోకి తీసుకున్నామన్నారు.

అలాగే కొండా సురేఖ దంపతుల గన్‌మెన్‌ కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయినట్లు ఆమె తెలిపారు. కొండా సురేఖ ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మహబూబాబాద్‌ ఘటనపై డీజీపీ గిరీష్‌కుమార్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని హోంమంత్రి తెలిపారు.

Read :  Thousands throng Idupulapaya to pay homage to YSR

Check Also

ys sharmila nomination

YS Sharmila Submits Nomination for Kadapa Lok Sabha Seat

Kadapa: YS Sharmila Reddy, the All India Congress Committee (APCC) chief, filed her nomination for …

Mydukur to Nellore

APSRTC Bus Timings – Anantapur to Kadapa

Anantapur – Kadapa bus timings, fare, schedule. APSRTC Bus timings, fare details, distance, route and …

One comment

  1. KCR down…down…
    YS Jagan Jindabad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *