రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, సోనియాగాంధీ, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వీరిలో ఎవరికి నమస్కరించినా రాజశేఖరరెడ్డి ఎక్కడున్నాడని, ఎలా ఉన్నాడని అడిగే వారన్నారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి ఎక్కడికెళ్లినా యువకులంతా కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ అంటూ నినాదాలు చే,సేవారని వివరించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో పరిపాలన చూశాక అంతటి స్థాయి వ్యక్తి ఇక రారేమోనన్న సందేహం అందరిలో ఉందన్నారు. వైఎస్ కుమారుడు జగన్ నాకు బిడ్డేనని, మగ పిల్లలు లేని తాను జగన్‌లో కొడుకును చూసుకుంటున్నానని తెలిపారు.
రాజశేఖరరెడ్డి స్థాయిలో జగన్ను చూడాలని దేవున్ని ప్రార్థిస్తున్నానన్నారు. ‘నా బిడ్డను వైఎస్ స్థాయిలో చూసుకోవాలి. మీరంతా వెన్నంటే ఉండాలని నిండు హృదయంతో కోరుతున్నా.. వైఎస్‌కు సమాన స్థాయిలో ఎదగాలని ఆశీర్వదిస్తున్నా.. నామాట వృ«థా కాదు.. ఆ భగవంతుడు కచ్చితంగా అనుగ్రహిస్తాడు.. జగన్ మరో చరిత్ర సృష్టిస్తాడు.. ఆ విశ్వాసం, నమ్మకం నాకుంది’ అంటూ సాయిప్రతాప్ ఉద్వేగ భరితంగా ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ముఖ్యమంత్రిగా 50 లక్షల ఎకరాలకు సేద్యపు నీరందించే అవకాశం తనకు దక్కాలని వైఎస్ తనతో అనే వారని వివరించారు. ‘వైఎస్‌ను తలుచుకుంటే దుఃఖం పొంగి పొర్లుకొస్తోంది.. నేను తనువు చాలిస్తే నా విగ్రహాన్ని కూడా ఇక్కడే (వైఎస్ కాంస్య విగ్రహం వైపు చేయి చూపుతూ) నాస్నేహితుని పక్కలో ఉంచాలని ప్రార్థిస్తున్నా. ఈ కోరికను ఇక్కడున్న యువకులు, జగన్‌మోహన్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు తీర్చాలి’ అన్నారు.
ఏప్రిల్ రెండవ వారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తా : వైఎస్ జగన్
రాష్ట్రంలో నాన్న (వైఎస్) కోసం మృతి చెందిన 660 మంది కుటుంబాలను ఏప్రిల్ రెండవ వారం నుంచి ప్రతి జిల్లాకు ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శిస్తానని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ప్రియతమ నాయకుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదరించారన్నారు. ఇంతమంది ఆదరణ, అభిమానం కల్గిన గొప్ప నాయకుడి ఫొటో రాష్ట్రంలోని ఏ ఇంటికెళ్లినా కన్పిస్తుందన్నారు. ఆయన కుమారుడిగా పుట్టడం వరంగా భావిస్తున్నానన్నారు. మీ అందరి కుటుంబ సభ్యునిగా లభిస్తున్న ఆదరణ, అభిమానాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నాన్న మృతి చెంది దాదాపు ఐదు నెలలు కావస్తోందని, ఆయన మృతి చెందిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే తాను, తన కుటుంబ సభ్యులు తేరుకుంటున్నారన్నారు.
మీ అందరి ఆదరణ, ఆప్యాయతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మీ ముందుకొచ్చి మీ అందరి కోసం పనిచేస్తానన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గల్లా అరుణకుమారి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖమంత్రి ఎస్‌ఎండి అహ్మదుల్లా, ఎమ్మెల్సీలు వైఎస్ వివేకానందరెడ్ది, షేక్ హుసేన్, మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డిలు ప్రసం గించారు. విగ్రహావిష్కరణ అనంతరం జిల్లా శాంతి సంఘం సభ్యులు నాగాంజనేయశర్మ, బిషప్ ఏసువరప్రసాద్, ముస్లిం మత పెద్ద అహ్మద్‌పీర్ షహమీరిలు మత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు కె. శ్రీనివాసులు, ఎ. అమర్‌నాథ్‌రెడ్డి, జి. శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కమలమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంరెడ్డి సుబ్బారెడ్డి, చెంగల్రాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్. వరదరాజులురెడ్డి, జి.వి. ప్రసాద్, జి. మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ రామమునిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి, హిందూపురం ఇన్‌ఛార్జి ఖాసింఖాన్, టీటీడీ మాజీ సభ్యుడు నవనీశ్వర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అల్లె ప్రభావతి, కా ర్పొరేటర్ అంజాద్‌బాషా, బండి హనుమంతు, చక్రవర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను కలుస్తా: జగన్
జగన్‌లో వైఎస్‌ను చూసుకుందాం
వైఎస్ విగ్రహావిష్కరణ సభలో కేంద్ర మంత్రి సాయిప్రతాప్
ఆ రోజుల్లో రాజశేఖరరెడ్డి ఎక్కడికెళ్లినా ‘కాబోయే ముఖ్యమంత్రి వైఎస్’ అంటూ నినాదాలు చేసే వారని, నేడు వైఎస్ జగన్‌పై ప్రజలు అదే అభిమానం చూపుతున్నారని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఎ.సాయిప్రతాప్ పేర్కొన్నారు. కచ్చితంగా జగన్‌మోహన్‌రెడ్డి మహానేత వైఎస్ అంతటి వాడవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైఎస్‌ఆర్ సర్కిల్(హెడ్ పోస్టాఫీసు వద్ద)లో బుధవారం ఉదయం 10.10 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకున్న అనుబంధం, ప్రేమ 44 ఏళ్ల కిందటిదన్నారు. 1984లో తొలిసారి రాజంపేట పార్లమెంటు ఎన్నికల్లో తనకు తెలియకుండానే టికెట్ ఖరారు చేశారని, ‘ఒక్క మాట కూడా అడక్కుండా టికెట్ కేటాయించావే రాజూ’ అని అంటే స్నేహితునిగా నాకు ఆ హక్కు ఉందన్నారని ఆయన వివరించారు. నామినేషన్ వేయకపోతే ‘ఆ చేతులతోనే ఇంత విషం ఇవ్వు సాయీ’ అని ఆరోజు వైఎస్ అన్నారని గుర్తు చేసుకున్నారు.’ఆ మాట నీ నోట రానివ్వొద్దు మిత్రమా.. నీకోసం ప్రాణాలిచ్చేందుకు ఎల్లవేళలా నీవెంటే ఉంటాన’ని చెప్పానన్నారు. అనంతరం ఎన్నికల సభలో ‘రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా.. మీ అందరూ ఓట్లు వేసి గెలిపించాల’ని కోరి ప్రసంగాన్ని విరమించుకున్నానన్నారు. ‘చాలా బాగా ప్రసంగించావు సాయీ’.. అంటూ వైఎస్ రాజకీయంగా తనకు అన్ని విధాలా అండగా నిలిచారన్నారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, సోనియాగాంధీ, కోట్ల విజయభాస్కరరెడ్డిలలో ఎవరిని కలిసినా రాజశేఖరరెడ్డి ఎలా ఉన్నాడని అడిగే వారన్నారు. తనను చూస్తేనే వారు వైఎస్‌ను గుర్తు చేసుకునే వారని తెలిపారు. రాజూ.. నీకే గనుక అవకాశమిస్తే రాష్ట్రాన్ని సమగ్రంగా తీర్చిదిద్దాలంటూ తాను కోరిన కోరికను కూడా వైఎస్ నెరవేర్చారన్నారు. ఈ గ డ్డ మీద పుట్టిన పులిబిడ్డ వైఎస్ అన్నారు.
మగ పిల్లలు లేని తాను జగన్‌లో కొడుకును చూసుకుంటున్నానని తెలిపారు. ‘నా బిడ్డను వైఎస్ స్థాయిలో చూసుకోవాలి. మీరంతా వెన్నంటే ఉండాలని నిండు హృదయంతో కోరుతున్నా.. వైఎస్‌కు సమాన స్థాయిలో ఎదగాలని ఆశీర్వదిస్తున్నా.. నా మాట వృ«థా కాదు.. ఆ భగవంతుడు కచ్చితంగా అనుగ్రహిస్తాడు.. జగన్ మరో చరిత్ర సృష్టిస్తాడు.. ఆ విశ్వాసం, నమ్మకం నాకుంది’ అంటూ సాయిప్రతాప్ ప్రజల హర్షధ్వానాల మధ్య ఉద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా 50 లక్షల ఎకరాలకు సేద్యపు నీరందించే అవకాశం తనకు దక్కాలని వైఎస్ తనతో అనే వారని వివరించారు. నా స్నేహితుని ఆత్మకు శాంతి ప్రసాదించాలని ప్రతి రోజూ ఆ దేవుడ్ని కోరుతున్నానని తెలిపారు.
స్నేహితుని చెంతనే విగ్రహం ఏర్పాటు చేయండి
‘వైఎస్‌ను తలుచుకుంటే దుఃఖం పొంగుతోంది.. నేను తనువు చాలిస్తే నా విగ్రహాన్ని కూడా (వైఎస్ కాంస్య విగ్రహం వైపు చూపుతూ) నా స్నేహితుని పక్కనే ఉంచాలని ప్రార్థిస్తున్నా. ఈ కోరికను ఇక్కడున్న యువకులు, జగన్‌మోహన్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు తీర్చాలి’ అని సాయిప్రతాప్ అన్నారు. నాయకునికి ఏ విధమైన లక్ష్యాలు ఉండాలనే విషయంతో పాటు, మహానేత చరిత్ర కూడా రాబోయే రోజుల్లో యువతకు తెలిసేలా శిలాఫలకాలపై చెక్కించాలన్నారు. ఆ ఫలకాల్లో రాజశేఖరుని చరిత్ర చదివి యువత ఆ బాటలో పయనించాలనేది తన కోర్కె అని సాయిప్రతాప్ అన్నారు.
రైతు బాంధవుడు వైఎస్ : మంత్రి గల్లా
రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల పరిపాలన స్వర్ణయుగమని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలు, రైతుల కోసం పరితపించిన తీరుతో ఆయన రైతు బాంధవుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు. తనను కడప జిల్లా తోబుట్టువుగా గుర్తించారని, ప్రతి మహిళకు అన్నగా వైఎస్‌ఆర్ నిలిచారన్నారు. తాను మంత్రి స్థాయికి ఎదిగానంటే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలువేనని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖమంత్రి ఎస్‌ఎండి అహ్మదుల్లా పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని ఎన్నటికీ మరిచిపోలేనని, అప్పట్లో వైఎస్ తమ నాయకుడని, ఇప్పుడు జగనే తమ నాయకుడన్నారు. ముస్లింలకు రూ.2,220 కోట్ల బడ్జెట్ వచ్చిందంటే వైఎస్ రాజశేఖరుని చలువేనన్నారు. ప్రతి పేద ముస్లిం కుటుంబం వైఎస్‌కు రుణపడి ఉంటుందన్నారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చూడాలి: వివేకా
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి పయనించాలని ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్ది పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరాట పడ్డారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వాలు వైఎస్ నిర్ణయాలకు, పథకాలకు అనుగుణంగా ప్రభుత్వ ఫలాలు పేదల దరికి చేరేలా కృషి చేయాలన్నారు. మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక 56 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తయితే, ఐదేళ్ల వైఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి మరో ఎత్తన్నారు. ఎమ్మెల్సీ షేక్ హుసేన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను పచ్చతోరణంగా ఉంచేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించారన్నారు. అనంతరం శాంతిసంఘం సభ్యులు నాగాంజనేయశర్మ, బిషప్ ఏసువరప్రసాద్, అహ్మద్‌పీర్ షహమీరిలు ప్రార్థనలు జరిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు కె. శ్రీనివాసులు, ఎ.అమర్‌నాథ్‌రెడ్డి, జి. శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కమలమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంరెడ్డి సుబ్బారెడ్డి, చెంగల్రాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్. వరదరాజులురెడ్డి, జి.వి. ప్రసాద్, జి. మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ రామమునిరెడ్డి పాల్గొన్నారు.
– సాక్షి