ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం (79) ఇక లేరు. శనివారం ఉదయం గుండెపోటుతో ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.
పద్మనాభం రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.
పూర్తిపేరు | బసవరాజు పద్మనాభరావు |
జననం | ఆగస్టు 20, 1931 |
మరణం | ఫిబ్రవరి 20, 2010 |
వయస్సు | 79 సంవత్సరాలు |
భార్య | సరోజమ్మ |
సంతానం | 5గురు కుమార్తెలు, 2 కుమారులు |
స్వస్థలం | సింహాద్రిపురం, కడప జిల్లా |
తల్లిదండ్రులు | బసవరాజు వెంకటశేషయ్య, శాంతమ్మ |
విద్యాభ్యాసం | బోర్డ్ హైస్కూలు, సింహాద్రిపురం & హైస్కూలు ప్రొద్దుటూరు |
మొదటి సినిమా | మాయలోకం (శరబంది రాజుకు మొదటి కొడుకు (చిన్నప్పుడు)) |
రెండవ సినిమా | త్యాగయ్య (శిష్యుని పాత్ర), రేణుకా ఫిలింస్ |
3వ సినిమా | ముగ్గురు మరాఠీలు (తంతీరావు పాత్ర) |
చివరి సినిమా | టాటా బిర్లా మద్యలో లైలా |
దర్శకుడిగా | శ్రీరామకధ (మొదటి సినిమా) |
నిర్మాతగా | దేవత (మొదటి సినిమా)పొట్టి ప్లీడర్ (రెండవ సినిమా)శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్నరేఖా మురళి ఆర్ట్స్ (స్వంత సంస్థ) |
అవార్డులు | బంగారు నంది ( ఉత్తమ దర్శకుడు 1970 – కధానాయిక మొల్ల చిత్రానికి) |
నచ్చిన దర్శకులు | కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి |
ప్రతీ మనిషి జీవితంలోను
మిట్టపల్లాలుంటాయి – సుఖదుఃఖాలుంటాయి.
నా జీవితమూ దానికి మినహాయింపు కాదు.
– బసవరాజు పద్మనాభం
హాస్యనటుడు పద్మనాభం జీవిత విశేషాలు…
[flagallery gid=8 name=”Gallery”default_int]